హైదరాబాద్, వెలుగు: జంటనగరాల్లో వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న జాగాల వేలానికి హౌసింగ్ బోర్డు మంగళవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ జాగాలు గచ్చిబౌలి, లింగంపల్లి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, చింతల్, నిజాంపేట ప్రాంతాల్లో ఉన్నాయి. బౌరంపేటలో 2,600 గజాలు, భరత్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర1,106 గజాలు, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో 266 గజాలు, చింతల్ హౌసింగ్ బోర్డు కాలనీలో 6 ఫ్లాట్లు, గచ్చిబౌలి హౌసింగ్ బోర్డు కాలనీలో 3 ఫ్లాట్లు, నిజాంపేటలో ఒక ఫ్లాటు ఉంది.
ఈ నెల 23న వీటికి వేలం నిర్వహించనున్నట్టు హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. వేలం జరిగే రోజు ఉదయం వరకు డీడీ చెల్లించి ఇందులో పాల్గొనవచ్చని వెల్లడించారు.
