- అగ్రికల్చర్, అనుబంధ రంగాలకు రూ.1.81 లక్షల కోట్లు
- క్రాప్ లోన్లకు రూ.97 వేల కోట్లు
- గతేడాదితో పోలిస్తే ప్రయారిటీ రంగాలకు 15 శాతం వృద్ధి
- 2026–27 నాబార్డు ఫోకస్ పేపర్ విడుదల
హైదరాబాద్, వెలుగు : తెలంగాణలో ప్రాధాన్య రంగాలకు 2026-=27 ఆర్థిక సంవత్సరానికి రూ.4.43 లక్షల కోట్ల క్రెడిట్ సామర్థ్యం ఉందని నాబార్డు అంచనా వేసింది. ఇది గతేడాదితో పోలిస్తే 15 శాతం(రూ.443.31 కోట్లు) అధికమని తేల్చింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే లక్ష్యంగా నాబార్డు 2026=27 వార్షిక ప్రణాళికను విడుదల చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో జరిగిన స్టేట్ క్రెడిట్సెమినార్లో నాబార్డు2026=27 స్టేట్ఫోకస్పేపర్ను రిలీజ్ చేసింది.
స్టేట్ ఫోకస్ పేపర్ లో అగ్రికల్చ్, అగ్రి అలైడ్ యాక్టివిటీస్, అగ్రికల్చరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ అండ్ అగ్రో-ప్రాసెసింగ్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఫార్మ్ మెకనైజేషన్‌పై ఎక్కువ దృష్టి సారించింది. ఎంఎస్ఎంఈ ఫైనాన్సింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎడ్యుకేషన్, హౌసింగ్, సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఫోకస్ పెంచింది. ఎఫ్పీఓల బలోపేతం, కోఆపరేటివ్స్, ప్యాక్స్ ఆధునీకరణ, జీఐ-ఆధారిత క్లస్టర్లు, క్లైమేట్ రెసిలియంట్ వ్యవసాయ పద్ధతుల స్కేలప్‌పై ప్రధానంగా దృష్టి సారించింది.
పంట రుణాలకు 97,023 కోట్లు
ప్రాధాన్యతా రంగాలకు రూ. 4.43 లక్షల కోట్లపైగా రుణాలు ఇవ్వాలని నాబార్డు నిర్ణయించింది. వ్యవసాయం కోసం రూ.1,81,228.45 కోట్లు మార్కెటింగ్ నిధులు కేటాయించింది. ఇందులో పంట రుణాలకు రూ.97023.58 కోట్లు, అనుబంధ రంగాలకు లోన్ల కోసం రూ.57,269.70 కోట్లు.. మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 7,806.46 కోట్లు, యాన్సిలరీ యాక్టివిటీస్‌కు రూ.19,128.70 కోట్లు కేటాయింపులు వేసింది.
ఈ సందర్భంగా రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి మాట్లాడుతూ.. కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు అందించాలని సూచించారు. తెలంగాణ రైజింగ్ మిషన్ డాక్యుమెంట్ 2047తో నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్ సమన్వయం కలిగి ఉందని ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్ చెప్పారు. సీఎస్రామకృష్ణ రావు మాట్లాడుతూ..రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించే ఫ్రేమ్‌వర్క్‌ను వివరించారు. వ్యవసాయం జీఎస్డీపీలో 16- నుంచి 17% ఉండగా 46% కార్మికులకు ఉపాధి కల్పిస్తోందని చెప్పారు.
నాబార్డు తెలంగాణ సీజీఎం ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ..రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రంగాల వారీగా, ప్రాంతాల వారీగా అవకాశాలను గుర్తించడంతో పాటు మౌలిక సదుపాయాల లోపాలను కూడా సదస్సు హైలైట్ చేసిందని వివరించారు. స్టేట్ ఫోకస్ పేపర్‌ను ఆన్యువల్ క్రెడిట్ ప్లాన్‌కు బేస్ డాక్యుమెంట్‌గా ఎస్ఎల్బీసీ డీజీఎం ప్రియబ్రత మిశ్రా పేర్కొన్నారు.రైటప్..2026=27 నాబార్డు ఫోకస్ పేపర్ విడుదల చేస్తున్న కోదండరెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, నాబార్డు సీజీఎం తదితరులు
