హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో కేరళ టూరిజం రోడ్ షో

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో కేరళ టూరిజం రోడ్ షో

హైదరాబాద్, వెలుగు: కేరళ పర్యాటక శాఖ 'ట్రావెల్ నౌ, పోస్ట్ లేటర్' పేరిట వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. పర్యాటకులు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడానికి ముందు ఆ ప్రదేశ అనుభూతిని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలనేది దీని ఉద్దేశం. పర్యాటకుల కోసం వచ్చే నెల  31 వరకు  సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 

దేశీయ పర్యాటకులను ఆకర్షించేందుకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో  మంగళవారం రోడ్ షో నిర్వహించింది. కోజికోడ్, వయనాడ్ వంటి ప్రాంతాలతో పాటు సాహస క్రీడలు, ఆయుర్వేదంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపింది. 2025 సంవత్సరానికి ఉత్తమ వెల్ నెస్ డెస్టినేషన్ అవార్డును కూడా గెలుచుకున్నామని తెలిపింది.