
పుదుచ్చేరి: దేశమంతటా ఎండలు దంచికొడ్తుండటంతో జనం రోడ్ల మీదకు రావడానికే జంకుతున్నరు. తప్పనిసరై బయటకు వచ్చిన వాళ్లు.. ఎండల్లో ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర వెయిట్ చేయాలంటే నరకం చూస్తున్నరు. అయితే, జనం కష్టాలను పుదుచ్చేరి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ బాగా అర్థం చేసుకున్నది. అందుకే వారికి కాస్తయినా ఎండల నుంచి ఉపశమనం కలిగిద్దామంటూ ఇలా ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద పెద్ద పెద్ద గ్రీన్ నెట్లను ఏర్పాటు చేసింది. దీంతో సిగ్నల్స్ ను జంప్ చేయాలన్న ఆలోచన కూడా లేకుండా జనం హాయిగా గ్రీన్ సిగ్నల్ పడేదాకా వెయిట్ చేసి వెళ్తున్నరు. దీంతో ఈ గ్రీన్ నెట్ లకు సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. తమ సిటీలోనూ ఇలాంటి ఏర్పాటు చేస్తే బాగుంటుందంటూ అనేక సిటీల జనాలు కోరుతున్నారు.