పోలీసుల ఫ్లాగ్​ మార్చ్​

పోలీసుల ఫ్లాగ్​ మార్చ్​

పద్మారావునగర్​, వెలుగు : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో వారాసిగూడ ఇన్​స్పెక్టర్​ఆర్​.సైదులు ఆధ్వర్యంలో  పోలీసులు గురువారం ఫ్లాగ్​ మార్చ్​నిర్వహించారు. చిలకలగూడ ఇన్ స్పెక్టర్​అనుదీప్​, ఎస్ఐ లు టి.సుధాకర్, ఆర్​. ప్రకాశ్​రెడ్డి, కిషోర్, సీఐఎస్ఎఫ్​కు చెందిన 62 మంది జవాన్లు  పార్సీగుట్ట క్రాస్ రోడ్డు నుంచి అశోక్​ నగర్​, వైఎస్ ఆర్ పార్క్ , రాంనగర్​

లక్ష్మమ్మ పార్కు లేన్​, రాంనగర్​ మెయిన్​ రోడ్డు, పార్సీ గుట్ట మెయిన్​ రోడ్డు మార్చ్ తీశారు. లోక్​ సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి రాజకీయ నేతలు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎన్నికల కమిషన్​ రూల్స్  ప్రతి ఒక్కరు పాటించాలని, లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.