అగ్రరాజ్యం అమెరికా ఐటీ జాబ్లకు అడ్డా. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అక్కడికి వెళ్లి జాబ్ చేయాలని కలలు కంటుంటారు. ముఖ్యంగా తెలుగు టెకీలు అమెరికా వెళ్లాలని ఎంతో ప్లాన్ చేసుకుంటుంటారు. ఆ అవకాశం కోసం ఏండ్లుగా ఎదురు చూస్తుంటారు. కంపెనీ ఎప్పుడు ఆఫర్ చేస్తుందా? ఎప్పుడు వెళ్దామా? అన్నట్లు ఉంటారు. ఫ్రెషర్స్మొదలుకొని సీనియర్స్ వరకు చాలమందిది ఇదే డ్రీమ్. అయితే ఇప్పుడు సీన్ మారింది. మనోళ్లు ‘‘అమెరికా వద్దు… మెక్సికో ముద్దు’’ అంటున్నారు. అమెరికా కంటే మెక్సికో వెళ్లడానికే ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఇక్కడి గౌడలజర సిటీకి క్యూ కడుతున్నారు. ఇప్పుడీ సిటీ మనోళ్ల న్యూ డెస్టినేషన్‌గా మారింది. అంతగా ఈ సిటీలో ఏముంది? అమెరికాను మించి ఎందుకు ఆకర్షిస్తోంది?
లివింగ్ కాస్ట్ బెంగళూరంతే..
ప్రధానంగా తెలుగోళ్లకు గౌడలజర స్వర్గధామంగా మారింది. ప్రస్తుతం అక్కడ 2,000 తెలుగు ఫ్యామిలీస్ ఉంటున్నాయని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీఐటీఏ) ప్రెసిడెంట్సందీప్ కుమార్మక్తాలా చెప్తున్నారు. ఇక్కడ టీసీఎస్, హెచ్‌సీఎల్ లాంటి పెద్ద కంపెనీలుసహా125 ఐటీ సంస్థలు కూడా ఉన్నాయట. దీంతో యంగ్ ఐటీ ప్రొఫెషనల్స్మెక్సికో వెళ్లేందుకే ఇష్టపడుతున్నారు. మరోవైపు వీసా రూల్స్ఈజీగా ఉండడం, శాలరీ ప్యాకేజీలు అధిక మొత్తంలో రావడం, లివింగ్కాస్ట్ కూడా తక్కువగా ఉండడం, అమెరికాకు పక్కనే మెక్సికో ఉండడం కూడా దీనికి కారణాలు. ‘‘గౌడలజరా సిటీలో లివింగ్కాస్ట్ బెంగళూర్‌కు సమానంగా ఉంటుంది. పేయింగ్గెస్ట్ హాస్టల్స్కూడా ఈజీగా దొరుకుతాయి. సింగిల్రూమ్కు రూ.15,000 చెల్లిస్తే సరిపోతుంది” అని సందీప్ చెప్పారు. ఇక గౌడలజరలో వలస వచ్చినవారే ఎక్కువ కావడంతో క్రైమ్ రేట్‌కూడా తక్కువగా ఉంటుంది. శాలరీ విషయానికి వస్తే ఫ్రెషర్‌కు నెలకు యావరేజ్‌గా30,000 పెసోస్ (రూ.1.10 లక్షలు) ఉంటుంది. అదే ఇండియాలో ఫ్రెషర్ స్టార్టింగ్ప్యాకేజీ ఏడాదికి రూ.3–5 లక్షలు. మెక్సికన్స్ కు టెక్నికల్, ఇంగ్లిష్ స్కిల్స్ తక్కువుండటమూ మనోళ్లకు కలిసొస్తోందని అంటున్నారు.