హైదరాబాద్, వెలుగు: గురుకులాల్లో ఫిజికల్ డైరెక్టర్, క్రాఫ్ట్ టీచర్, లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ను ఆదివారం తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు రిలీజ్ చేసింది. ఈ నెల 24 నుంచి ఆన్ లైన్ లో అప్లికేషన్లు తీసుకోనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. వచ్చే నెల 24వ తేదీ సాయంత్రం వరకు అప్లికేషన్లకు గడువు ఇచ్చారు. లైబ్రేరియన్ పోస్టులు 434 ఉండగా, క్రాఫ్ట్ టీచర్ పోస్టులు 88, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 275 ఉన్నాయి. పూర్తి వివరాలు టీఆర్ఈఐఆర్బీ వెబ్సైట్లో ఉంచిన డీటెయిల్డ్ నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు.

