ఫోన్ చేస్తే చాలు.. ఇంటిదగ్గరే బూస్టర్ డోస్

ఫోన్ చేస్తే చాలు.. ఇంటిదగ్గరే బూస్టర్ డోస్

హైదరాబాద్​, వెలుగు: బూస్టర్ డోస్  తీసుకునేందుకు జీహెచ్ఎంసీ హెల్ప్​ లైన్ నం​ 040–-21111111కి ఫోన్ చేస్తే ఇంటికొచ్చి వ్యాక్సిన్​అందిస్తామని బల్దియా అధికారులు సోమవారం  ప్రకటించారు. 60 ఏండ్లు పైబడి ఇతర వ్యాధులు ఉండి  పీహెచ్ సీకి లేదా వ్యాక్సినేషన్ సెంటర్ కి వెళ్లి వ్యాక్సిన్  వేసుకోలేని వారు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.  థర్డ్ వేవ్ నేపథ్యంలో అవసరమైన వారు  బూస్టర్ డోస్  తీసుకోవాలన్నారు.  ఫోన్ చేస్తే  జోన్, సర్కిల్,  వార్డుకు సంబంధించిన వారికి తెలియజేసి మొబైల్ వాహనం ద్వారా ఇంటికి వచ్చి వాక్సినేషన్ వేస్తారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.