- మైత్రి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కె.శ్రవణ్ కుమార్
వికారాబాద్, వెలుగు : మన దేశ భవిష్యత్ ను మనమే నిర్మాణం చేసుకునే అవకాశం ఓటు హక్కు ద్వారా ఉంటుందని వికారాబాద్ మైత్రి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కె.శ్రవణ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే సంకల్పంతో ఆస్పత్రిలో పోలింగ్ రోజు సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు.
ఓటర్లు తమ పోలింగ్ బూత్ లో ఓటు వేసి, సిరా చుక్కను చూపించి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంఆర్పీ పెట్రోల్ పంప్ ఎదురుగా ఆస్పత్రిలో ఫ్రీ కన్సల్టేషన్ తో ట్రీట్ మెంట్ చేయించుకోవచ్చని సూచించారు. డాక్టర్ సలహా మేరకు రక్త పరీక్షలు (సీబీపీ, ఆర్ బీఎస్) కూడా ఫ్రీగా చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
