నీట్ పేపర్ లీక్ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై ఉక్కుపాదం మోపేందుకు ఢిల్లీ పోలీసులు సిద్దమవుతున్నారు. నీట్ పేపర్ లీక్ నిరసనల సందర్బంగా హింసకు పాల్పడినట్టు తేలితే విద్యార్థులు, యవతపై సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు ప్రత్యేక అధికారులను పోలీసులు ఇచ్చింది ప్రభుత్వం. హింసకు పాల్పడినట్లు రుజువైతే వారి పాస్ పోర్టు రద్దు చేయడమే కాకుండా ఏడాది పాటు నాన్ బెయిలబుల్ జైలు శిక్షపడేలా జాతీయ భద్రతా చట్టం (NSA) కింద ప్రత్యేక అధికారాలు పొడిగించనట్లు తెలుస్తోంది. ఇప్పటికే నీట్ లీకులు, రద్దు, వాయిదాలతో తమ సమయాన్ని, భవిష్యత్తును కోల్పోయిన విద్యార్థులు.. ఇదే గనక జరిగితే విద్యార్థులు, యువత భవిష్యత్తు మరింత గందరగోళంలో పడే అవకాశం ఉంది.
ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వం క్రూరమైన చట్టాన్ని ఉపయోగిస్తోందని పలువురు రాజకీయ నేతలు కూడా ఆరోపించారు. సీజేపీ నిరసనను అణచివేసేందుకు NSA కింద ఫుల్ పవర్స్ ఇచ్చారని చెబుతున్నారు.
అయితే ఈ విషయంపై ఢిల్లీ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఆరోపణలను ఢిల్లీ పోలీసులు తోసిపుచ్చారు. ఎన్ ఎస్ ఏ చట్టాన్ని ప్రతి మూడు నెలలకొకసారి పునరుద్దరిస్తారు.. అందులో భాగంగానే ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఇది కేవలం సాధారణ అడ్మినిస్ట్రేటివ్ రెన్యువల్ మాత్రమే అని అధికారులు చెబుతున్నారు. ఈ ఉత్తర్వు ఆందోళనలు ముందే జారీ చేసిన సాధారణ పరిపాలనా పునరుద్ధరణ మాత్రమేనని వారు తెలిపారు.
ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలను అదుపులోకి తెచ్చేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆందోళనల సందర్బంగా హింసపై దర్యాప్తు జరుగుతోంది.. ఆతర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
NSA అంటే..
దేశ రక్షణకు, రాష్ట్ర భద్రతకు, ప్రజా శాంతి పరిరక్షణకు హానికలిగించే చర్యలను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ భద్రతా చట్టం (NSA) అధికారం కల్పిస్తుంది. ఈ చట్టం ప్రకారం అరెస్ట్ అయిన వారు మూడు నుంచి12 నెలల వరకు ఉండవచ్చు జైలు శిక్ష పడవచ్చ. ఈ చట్టాన్ని మాజీ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని సలహా మండలి సమీక్షిస్తుంది.
