జైల్లో సత్యేంద్ర జైన్ కు ప్రత్యేక సౌకర్యాలు..అధికారులు బదిలీ

జైల్లో సత్యేంద్ర జైన్ కు ప్రత్యేక సౌకర్యాలు..అధికారులు బదిలీ

తీహార్ జైలులో ఉన్న ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్‭కు.. ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారన్న ఆరోపణలతొ 12 మంది జైలు అధికారులను బదిలీ చేశారు. మంత్రి హోదాలో జైలులో ఉన్న సత్యేంద్ర జైన్ కు ప్రత్యేక సౌకర్యాలు అందుతున్నట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. ఆయన జైలులో ఉండి కూడా కుటుంబసభ్యులు కలుస్తున్నారని ఈడీ ఢిల్లీ కోర్టుకు తెలిపింది. జైలు అధికారులు ఆయనకు సహాయం చేస్తున్నారన్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో పూర్తి నివేదిక అందజేయాలని.. ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్‌ను కోరింది. ఆ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టి..  జైలు అధికారి అజిత్‌కుమార్‌ను ఇటీవల సస్పెండ్‌ చేయగా.. తాజాగా మరో 12 మంది జైలు అధికారులను బదిలీ చేసింది. 

ఈ ఏడాది మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ అధికారులు సత్యేంత్ర జైన్ ను అరెస్టు చేశారు. అయితే.. అరెస్టయ్యే ముందు వరకు జైన్ జైళ్ల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత జైళ్ల శాఖ బాధ్యతలను మరొకరికి అప్పగించారు.