కరోనా ఎఫెక్ట్….1400 మంది ఉద్యోగులను తొలగించిన ఓలా

కరోనా ఎఫెక్ట్….1400 మంది ఉద్యోగులను తొలగించిన ఓలా

బెంగళూరు : కరోనా ఎఫెక్ట్ ప్రముఖ క్యాబ్ సర్వీస్ ఓలా పై పడింది. లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా ఆ సంస్థ ఆదాయం లేదు. దీంతో సంస్థ నుంచి 1400 సిబ్బందిని తొలగిస్తున్నట్లు సంస్థ సీఈఓ భవష్ అగర్వాల్ తెలిపారు. ఓలా రైడ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫుడ్ బిజినెస్ లకు చెందిన ఉద్యోగులపై వేటు పడింది. కరోనా, లాక్ డౌన్ సంక్షోభం ఓలా ఉద్యోగులు వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపిందని భవష్ అగర్వాల్ చెప్పారు. సంస్థ ఆదాయం భారీగా పడిపోవటం మళ్లీ రికవరీ అయ్యేందుకు చాలా రోజులు సమయం పట్టే అవకాశం ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మార్చి 22 నుంచి దేశ వ్యాప్తంగా క్యాబ్ సేవలు నిలిచిపోవటంతో ఓలా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. ఓలా రైడ్స్ పై పడ్డ ఎఫెక్ట్ సంస్థ ఇతర వ్యాపారాలపైన ప్రభావం చూపింది.