నిజమే, కార్లు కొనేటోళ్లు తగ్గిన్రు

నిజమే, కార్లు కొనేటోళ్లు తగ్గిన్రు

మారుతి సుజుకీ ఇండియా ఛైర్మన్ భార్గవ

న్యూఢిల్లీ : ఆటో స్లోడౌన్‌‌పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను దేశంలో అతిపెద్ద కార్ల సంస్థ మారుతి సుజుకీ కూడా సమర్థించింది. ఓలా, ఉబర్ వంటి రైడ్ హైరింగ్ కంపెనీలు ఇండియాలో కొత్త కార్ల డిమాండ్‌‌పై దెబ్బకొడుతున్నాయని మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ ఆర్‌‌‌‌సీ భార్గవ అన్నారు. రైడ్ హైరింగ్ కంపెనీల వల్ల యువత కొత్త కార్లను కొనడం లేదన్నారు. యువత ఎక్కువగా తమ ఇన్‌‌కమ్‌‌ను ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై పెడుతున్నారని,  కార్లను ఇష్టపడటం లేదని నిర్మలా సీతారామన్ అన్నారు. ఓలా, ఉబర్‌‌‌‌లను వాడుతూ.. యువత కొత్త కార్ల కొనుగోళ్లను చేపట్టడం లేదని మంత్రి చెప్పారు.

వెహికిల్స్‌‌పై జీఎస్టీని తాత్కాలికంగా తగ్గించడం వల్ల అంత ఉపయోగం ఉండదని, ఇండస్ట్రీకి దీర్ఘకాలికంగా సాయం చేయదని భార్గవ పేర్కొన్నారు. సేఫ్టీ అండ్ ఎమిషన్స్ రెగ్యులేషన్స్‌‌ను కఠినతరంగా ప్రవేశపెడితే.. ఇండియాలో ఉత్పత్తి చేసే వెహికిల్స్‌‌లో క్వాలిటీ పెరుగుతుందని చెప్పారు.  కార్ల ధరలు పెరిగిన స్థాయిలో ఇండియన్ల కొనుగోలు శక్తి పెరగలేదని భార్గవ తెలిపారు. దీంతో కార్ల కొనుగోళ్లు వాయిదా పడుతున్నట్టు పేర్కొన్నారు. కొత్త నార్మ్స్ అమల్లోకి వస్తుండటంతో కార్ల ధరలు పెరుగుతున్నాయి. ఇండియాలో గత ఏడాది కాలంగా ప్యాసెంజర్ వెహికిల్ సేల్స్ విపరీతంగా పడిపోతున్నాయి. ఫైనాన్స్‌‌లు దొరకకపోవడం, ఓనర్‌‌‌‌షిప్ ఖర్చులు పెరగడం, ఎకనమిక్ స్లోడౌన్ వంటివి కార్ల అమ్మకాలను దెబ్బకొడుతున్నాయి.

Ola, Uber have hit demand for new cars in India, says Maruti Chairman RC Bhargava