కరీంనగర్: కరోనాకు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఓ వృద్ధుడు బెడ్‌పై నుంచి కింద పడి చనిపోయిన ఘటన కరీంనగర్‌లో జరిగింది. ఆదివారం జిల్లా ఆస్పత్రిలో ఈ దారుణం చోటు చేసుకుంది. సదరు వృద్ధుడు ఆక్సిజన్ అందక గిలగిల కొట్టుకుంటున్నా ఎవరూ సాయం చేయలేదని వార్డులోని మరో పేషెంట్ విడుదల చేసిన ఆడియో, ఫొటోలను బట్టి తెలుస్తోంది. సదరు వృద్ధుడు మృతి చెందిన తర్వాత ఆస్పత్రి సిబ్బంది ఆయణ్ను తిరిగి మంచంపైన పెట్టారని సమాచారం. ఆస్పత్రిలో తమ పరిస్థితి దారుణంగా ఉందని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధుడితోపాటు ఈ ఆస్పత్రిలో మరో రోగి కూడా చనిపోయాడని తెలిసింది.
