నేను టీకా వేసుకోను.. నా భార్యకు వేయిస్తే మంచాన పడింది

నేను టీకా వేసుకోను.. నా భార్యకు వేయిస్తే మంచాన పడింది

కరోనా టీకా వేసుకోవాలన్న రూల్ ఉందా అంటూ హెల్త్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు లక్ష్మణ్ అనే రైతు. తన భార్యకు టీకా వేయిస్తే మంచాన పడిందని చెప్పాడు. షుగర్ ఉండగా టీకా ఎందుకు వేయించావంటూ జగిత్యాల డాక్టర్ తిట్టాడన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను టీకా తీసుకోనని చెప్పాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మరిపల్లిలో జరిగింది. 100 శాతం వ్యాక్సినేషన్ చేయాలన్న ఉద్దేశంతో వైద్య, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతున్నారు. అయితే చాలా మంది వృద్ధులు, మహిళలు.. టీకాలు వేయించుకోవడం లేదు. వైద్య , ఆరోగ్య శాఖ అధికారులతో పాటు నేతలు నచ్చ చెప్పినా వినడం లేదు. వ్యాక్సిన్ వేయించుకుంటే జ్వరం వంటివి వస్తాయని జనం భయపడ్తున్నారు.