పండంటి కవలలకు జన్మనిచ్చిన 73 ఏళ్ల బామ్మ

పండంటి కవలలకు జన్మనిచ్చిన 73 ఏళ్ల బామ్మ

గుంటూరు : ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన మంగాయమ్మ(73) అనే వృద్ధురాలు కవల పిల్లలకు జన్మనిచ్చింది. బుధవారం గుంటూరులోని అహల్య నర్సింగ్ హోమ్‌లో మంగాయమ్మ ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చింది. సర్జరీ ద్వారా డెలివరీ చేసిన డాక్టర్లు..తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని తెలిపారు.1962లో వివాహమైన మంగాయమ్మకు ..ఏళ్లు గడిచినా తల్లి కావాలనే కోరిక తీరలేదు. ఆశలు నెరవేరకుండానే వృద్ధాప్యంలోకి అడుగుపెట్టింది.

తల్లి కావాలనే కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది. ఈ క్రమంలో కృత్రిమ సంతాన సాఫల్య విధానం గురించి తెలుసుకున్న మంగాయమ్మ ..IVF పద్దతిని తెలుసుకుంది. 2018-నవంబరులో గుంటూరులోని ఓ ప్రైవేటు హస్పిటల్ ను సంప్రదించింది. మంగాయమ్మకు బీపీ, షుగర్ లాంటి ఆరోగ్య సమస్యలేవీ లేకపోవడంతో డాక్టర్లు ఆమెకు సంతాన సాఫల్య చికిత్స ప్రారంభించారు. మొదటి సైకిల్‌ లోనే డాక్టర్ల కృషి ఫలించి మంగాయమ్మ గర్భం ధరించింది. నేడు పండంటి శిశువులకు జన్మనిచ్చింది. పెళ్లయిన 57 ఏళ్లకు తల్లి కావడంతో తన చిరకాల కోరిక తీరిందని సంతోషం తెలిపింది మంగాయమ్మ.