అదృష్టవంతురాలు : నొప్పంటే తెలియదు!

అదృష్టవంతురాలు : నొప్పంటే తెలియదు!

ఎవరైనా గిచ్చా రనుకోండి.. అమ్మా అని అంటాం .. ఎందుకు? నొప్పి పుట్టే కదా! కాలినా, దెబ్బ తగిలినా నొప్పికి విలవిల్లాడిపోతాం! అదేంటో.. స్కాట్లాం డ్ కు చెందిన 71 ఏళ్ల మహిళకు మాత్రం అసలు నొప్పంటే  ఏంటో తెలియదట. ఆమె పేరు జో కామెరాన్ . మాజీ టీచరమ్మ ఆమె. 65 ఏళ్ల ప్పుడు తుంటి ఎముక కదిలినా, ఆస్టియో ఆరరైటి్థ్స్ వచ్చినా నొప్పితో బాధపడలేదు. ఆ సమస్యకు ఆపరేషన్ చేసి నా ఆ ఆపరేషన్ తాలూకు నొప్పి కూడా రాలేదు. లండన్ లోని యూసీఎల్ ఆస్పత్రి డాక్టర్లను అది అయోమయంలో పడేసింది. వెంటనే ఆమెపై రీసెర్చ్​ మొదలుపెట్టారు . ఆ రీసెర్చ్​లో జెనిటిక్ మ్యుటేషన్ (జన్యు మార్పులు) కారణమని తేల్చారు.

పెద్ద యాక్సిడెంట్ జరిగినా…

రెండేళ్ల క్రితం ఓ వ్యాను ఆమె కారును ఢీకొట్టేసింది. ఆమెకు దెబ్బలు పెద్దగానే తగిలాయి. ఆమె కారు నుంచి దిగి యాక్సిడెం ట్ చేసిన డ్రైవర్ కు షేక్ హ్యాండిచ్చింది. దెబ్బలు తగిలాయని ఆ డ్రైవర్ చెప్పేం త వరకు ఆమెకు ఆ విషయమే అర్థం కాలేదు. అసలు భయం, ఆందోళన అన్న విషయాలూ ఆమెకు చాలా దూరంగా ఉంటాయట. ఒత్తిడి, డిప్రెషన్ టెస్టులు పెట్టగా ‘జీరో/సున్నా ’ వచ్చిందట స్కోరు.

రెండు మార్పులు

ఆమె అసాధారణ పరిస్థితికి కారణమేంటో తేల్చేందుకు ఆమె జన్యువులను పరీక్షించారు. రెండు మ్యుటేషన్లను గుర్తించారు. ఆ రెండు మ్యుటేషన్ల వల్లే ఆమెలో నొప్పి , ఆందోళన కలగట్లేదని తేల్చారు. ఒక మ్యుటేషన్ అందరిలోనూ మామూలేనని, అది ఎఫ్ ఏఏహెచ్ జీన్ పనిని మందగించేలా చేస్తుందని చెప్పారు. నొప్పికి కారణమయ్యే అనాం డమైడ్ అనే కెమికల్ ను విచ్ఛిన్నం చేసే ఎంజైమును ఈ జీన్ ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. అది ఎంత తక్కువగా బ్రేక్ డౌన్ అయితే, అంతలా నొప్పి ని తగ్గించేదిగా పనిచేస్తుందని వివరించారు. అయితే, రెండో మ్యుటేషన్ లో మాత్రం డీఎన్ ఏలో తెలియని జీన్ ను డిలీట్ చేస్తోందని గుర్తించారు. దానికే‘ఎఫ్ ఏఏహెచ్ అవుట్ ’ అని పేరు పెట్టారు . అదే ఎఫ్ ఏఏహెచ్ జీన్ ను నియంత్రిస్తోందని తేల్చారు . దీంతో అనాండమైడ్ విచ్ఛిన్నం తక్కువగా జరుగుతోందని, అందుకే ఆమెలో నొప్పి తెలియట్లేదని వివరించారు. ఈ పరిణామం నొప్పికి కొత్త మందులను కనుగొనేందుకు దోహదపడుతుందని సైంటిస్టులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈమెపేరు అక్కడ మారుమోగిపోతుందట. అదృష్టవంతురాలు అంటూ పొగడ్తలతో ముంచెత్తున్నారని జో కామెరాన్ కుటుంబసభ్యులు తెలిపారు.