
పవన్ కళ్యాణ్ పుట్టినరోజును ఫ్యాన్స్ పండుగలా సెలెబ్రేట్ చేసుకుంటారు. అలాగే ఆయన నటిస్తున్న సినిమాల నుంచి కూడా మేకర్స్ ఏదో ఒక అప్‌డేట్‌తో అభిమానులను ఖుషి చేస్తుంటారు. సెప్టెంబర్ 2న పవన్ బర్త్‌డే సందర్భంగా ‘ఓజీ’ టీమ్ ఓ స్పెషల్ ట్రీట్‌ను ప్లాన్ చేసింది. ఆరోజున ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయనుంది. 72 సెకన్లతో టీజర్ కట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో తమిళ నటుడు అర్జున్ దాస్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. అతని వాయిస్ ఓవర్‌తోనే టీజర్‌ను విడుదల అవనుందట. అలాగే ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్ కోసం సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్న నెటిజన్లకు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెట్స్ ఓ క్లారిటీ ఇచ్చింది. ‘సెప్టెంబర్ 2న రాబోయేది ఎవరు ఊహించనంతంగా ఉండబోతోంది’ అంటూ ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో కీలక షెడ్యూల్ జరుగుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.