మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. నెలలోనే రూ.100

మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. నెలలోనే రూ.100

గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెట్రోల్, డీజిల్ బాటలోనే నడుస్తున్నాయి. వంట గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. ఈ సారి సిలిండర్ పై రూ.25 పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఈ నెలలో వంటగ్యాస్ ధరలు పెరగడం ఇది మూడోసారి. ఫిబ్రవరి 4న 25 రూపాయలు పెంచగా, 15న మరో 50 రూపాయలు వడ్డించారు. ఇక ఈసారి మరో 25 రూపాయలు బాదారు. దీంతో ఈ ఒక్క నెలలోనే సిలిండర్ ధర 100 రూపాయలు పెరిగింది. పెరిగిన ధరతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర 794 రూపాయలకు చేరింది.