పది ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తే ఒక మిల్క్ ప్యాకెట్ ఫ్రీ

పది ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తే ఒక మిల్క్ ప్యాకెట్ ఫ్రీ

హర్యానా: మనం వాటర్ బాటిళ్లను లేదా కూల్ డ్రింక్‌లను కొనుక్కొని తాగిన తర్వాత బాటిళ్లు ఎందుకు పనికొస్తాయిలే అని వాటిని పడేస్తుంటాం. అలా కాకుండా ఓ పది ప్లాస్టిక్ బాటిళ్లను ఇస్తే ఒక పాల ప్యాకెట్ ఫ్రీగా ఇస్తారట. అవును ఇది నిజమే.. కానీ మన దగ్గర కాదు. అది హర్యానాలోని పంచకుల పట్టణంలోనట. పంచకుల మునిసిపల్ కార్పొరేషన్‌ ప్లాస్టిక్‌ను నియంత్రించే క్రమంలో ఈ ఆఫర్ పెట్టింది. ప్లాస్టిక్ వ్యర్థాలకు బదులుగా పాల ప్యాకెట్లను అందించే బూత్‌లను ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వ ‘స్వచ్ఛ భారత్ అభియాన్’కు అనుగుణంగా, పంచకులను ప్లాస్టిక్ రహితంగా చేయడానికి అక్కడి కార్పొరేషన్’ వేస్ట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం’తో ముందుకు వచ్చింది.

‘స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రోగ్రాం కింద మేము ఇప్పటికే పంచకులలో ప్లాస్టిక్‌ను నిషేధించాం. అంతేకాకుండా మాకు 1 kg ప్లాస్టిక్ లేదా 10 ప్లాస్టిక్ బాటిళ్లు ఇస్తే వారికి 1 పాల ప్యాకెట్ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాం. అందుకే పంచకుల పట్టణంలో చాలాచోట్ల వీటా బూతులను ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు మేము ఐదు టన్నుల ప్లాస్టిక్ సేకరించాం. నగరవాసులు కూడా ఈ పథకానికి చాలా బాగా స్పందిస్తున్నారు’ అని పంచకుల అడ్మినిస్ట్రేషన్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ జర్నైల్ సింగ్ అన్నారు.

For More News..

అక్రమంగా ఇండియాలో ఉంటున్న సెక్స్ వర్కర్‌పై లైంగిక దాడి