హైదరాబాద్ లో ఆక్టోపస్ 3.0.. సిమ్ కార్డుల ముఠా అరెస్ట్

హైదరాబాద్ లో ఆక్టోపస్ 3.0.. సిమ్ కార్డుల ముఠా అరెస్ట్

బషీర్​బాగ్, వెలుగు: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలను అరికట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’ చేపట్టారు. సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న ముఠాలను లక్ష్యంగా చేసుకుని రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, కర్నాటక సహా 15 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సిమ్ కార్డులు అందజేస్తున్న 10 మంది ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేయగా, మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న మరో 30 మందికి నోఈటీసులు జారీ చేశారు.

గతంలో ‘ఆపరేషన్ ఆక్టోపస్ 1.0’ ద్వారా ఫేక్ బ్యాంక్ ఖాతాల యజమానులను, ‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’ ద్వారా వారికి సహకరించిన బ్యాంక్ సిబ్బందిని టార్గెట్ చేసిన పోలీసులు.. తాజాగా ‘3.0’ వెర్షన్ ద్వారా సిమ్ కార్డ్ సరఫరా నెట్​వర్క్​ను పూర్తిగా ఛేదించడంపై దృష్టి పెట్టారు.