విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ అల్వా నామినేషన్

విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ అల్వా నామినేషన్

విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ అల్వా  పార్లమెంట్‌లో నామినేషన్‌ ను దాఖలు చేశారు. కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌, ఇతర ప్రతిపక్ష నేతల సమక్షంలో ఆమె తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇటీవలే ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్‌ అల్వా పేరును ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించారు. కర్ణాటకకు చెందిన మాజీ మహిళా గవర్నర్ అయిన మార్గరేట్ అల్వా... గోవా, రాజస్థాన్‌, గుజరాత్‌ గవర్నర్‌గానూ పని చేశారు. కాగా ఇటీవలే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయిన జగదీప్ ధన్‌కర్‌ కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే రాష్ట్రపతి ఎన్నికకు ఇప్పటికే ఓటింగ్ పూర్తికాగా.... జులై 21న ఫలితాలు రానున్నాయి.