నీట్ లీకేజీ బాధ్యులపై  చర్యలు తీసుకోవాలి..ఓయూలో విద్యార్థి సంఘాల ధర్నా

నీట్ లీకేజీ బాధ్యులపై  చర్యలు తీసుకోవాలి..ఓయూలో విద్యార్థి సంఘాల ధర్నా

ఉప్పల్, వెలుగు: నీట్ ​పేపర్ ​లీకేజీపై ఢిల్లీలో నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జి చేయడం దుర్మార్గపు చర్యగా అని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. బుధవారం ఓయూ లైబ్రరీ నుంచి ఆర్ట్స్​ కాలేజీ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నీట్​లీకేజీపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా  పోలీసులు అడ్డుకున్నారు.