రాష్ట్రంలో వందలో 18 మందికి బీపీ, షుగర్​

రాష్ట్రంలో  వందలో 18 మందికి బీపీ, షుగర్​
  • రుగుతున్న లైఫ్​స్టైల్​ జబ్బులు
  • దేశవ్యాప్తంగా 30 ఏళ్లలో 22% పెరిగిన ఎన్​సీడీ కేసులు
  • 1990లో 37.9 శాతం.. 2016లో 61.8%
  • పట్టిపీడిస్తున్న బీపీ, షుగర్​, కేన్సర్​, గుండె జబ్బులు
  • లైఫ్​స్టైల్​, తిండి అలవాట్లే ప్రధాన కారణం
  • తగ్గిపోతున్న అంటు వ్యాధులు
  • 53.6 నుంచి 27.5 శాతానికి తగ్గుదల

హైదరాబాద్​, వెలుగు:

టైంకు తినకపోవడం, జంక్​ఫుడ్​, గాలి కాలుష్యం, పంటల్లో పురుగుమందుల వాడకం, ఎక్సర్​సైజ్​ చేయకపోవడం, పని ఒత్తిడి.. కారణాలేవైతేనేం జనాన్ని లైఫ్​స్టైల్​ జబ్బులు వేధిస్తున్నాయి. షుగర్​, బీపీ, కేన్సర్​, పక్షవాతం, కిడ్నీ, గుండె జబ్బుల వంటి నాన్​ కమ్యూనికెబుల్​ డిసీజెస్​ (ఎన్​సీడీ– ఒకరి నుంచి మరొకరికి వ్యాపించనివి) పట్టి పీడిస్తున్నాయి. అటు ఆరోగ్యానికి ఇటు జేబుకు చిల్లు పెడుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి వంద మందిలో 30 మంది ఏదో ఒక ఎన్​సీడీతో బాధపడుతున్నారు. వందలో 18 మందిని బీపీ, షుగర్​ బాధిస్తున్నాయి. ఎన్​సీడీ స్క్రీనింగ్​ టెస్టుల్లో ఈ విషయం తేట తెల్లమవుతోంది. రాష్ట్రంలో 30 ఏండ్ల నుంచి 65 ఏండ్ల లోపు వాళ్లు కోటి 37 లక్షల 17 వేల 186 మంది ఉన్నారు. 95 లక్షల 54 వేల 234 మందికి ఎన్​సీడీ స్క్రీనింగ్​ టెస్టులు చేశారు. వాళ్లలో 7 లక్షల 5 వేల 232 మందికి హైబీపీ, 3 లక్షల 77 వేల 823 మందికి షుగర్​ ఉన్నట్టు గుర్తించారు. మరో 6 లక్షల మందికి బీపీ, షుగర్​ రెండూ ఉన్నట్టు అనుమానిస్తున్నారు. వాళ్లకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెస్టులు చేయిస్తున్నారు. అనుమానిత కేసుల్లో ప్రతి వంద మందిలో 99 మందికి బీపీ లేదా షుగర్​ టెస్టులు పాజిటివ్​గా వస్తున్నాయి. ఈ లెక్కన రాష్ర్టంలో ప్రతి వందలో 18 మంది షుగర్​ లేదా బీపీతో బాధపడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిడ్నీ, హార్ట్​ఎటాక్, స్ట్రోక్​, సీవోపీడీ, కేన్సర్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాధితుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. ఆరోగ్యశ్రీలో అత్యధికంగా గుండె, కిడ్నీ జబ్బుల కోసమే ఖర్చు చేస్తున్నారు. గతేడాది ఏకంగా 13,130 మంది కామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (నోటి, గర్భాశయ కేన్సర్​, రొమ్ము) కేన్సర్ల బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ నేషనల్​ హెల్త్​ మిషన్​ కామన్​ రివ్యూ ప్రోగ్రామ్​లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

దేశంలో 22 శాతం పెరిగినయ్

దేశవ్యాప్తంగా 30 ఏళ్లలో ఎన్​సీడీ కేసులు22 శాతం పెరిగాయి. 1990లో 37.9 శాతం కేసులుంటే 2016 నాటికి 61.8 శాతానికి చేరాయి. ఈ నాలుగేళ్లలో అది మరింత పెరిగిందని, ఇప్పటి జబ్బుల్లో 65 నుంచి 70 శాతం అవే ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. 2018లో చేసిన ఎన్​సీడీ స్ర్కీనింగ్​లోనూ ఈ అంశం స్పష్టమైంది. దేశవ్యాప్తంగా (ఢిల్లీ, లక్షద్వీప్​ మినహా) 6 కోట్ల 51 లక్షల 94 వేల 599 మందికి టెస్టులు చేస్తే 31 లక్షల 02 వేల186 మందికి షుగర్​, 40 లక్షల 38 వేల 66 మందికి బీపీ, 11 లక్షల 06 వేల 360 మందికి షుగర్​–బీపీ, లక్షా 68 వేల122 మందికి కేన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 69,413 మందికి స్ర్టోక్​, లక్షా 98 వేల 753 మందికి గుండె జబ్బులున్నట్టు తేలింది. దానికి భిన్నంగా 20వ శతాబ్దంలో కొన్ని లక్షల మందిని పొట్టనబెట్టుకున్న అంటు వ్యాధులు ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. 1990 నాటికి అంటు వ్యాధి కేసులు 53.6% ఉండగా, 2016 నాటికి అవి 27.5 శాతానికి తగ్గాయి.

 

లెక్కలకే పరిమితం

ఎన్​సీడీపై కేంద్రం దేశవ్యాప్తంగా సర్వే చేయిస్తోంది. కోట్ల మందికి ఆ జబ్బులు ఉన్నాయని ఇప్పటికే కొన్ని టెస్టుల్లో తేలింది. రోగుల సంఖ్య పెరుగుతుండడంతో జిల్లా, సీహెచ్​సీల స్థాయిలో ఎన్​సీడీ సెంటర్లు పెట్టాలని నిర్ణయించింది. ఈ సెంటర్ల ద్వారానే రోగులందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నారు. గతంలో కొన్ని సర్వేలు చేసినా, లెక్కల వరకే పరిమితమైంది. ఎంత మందికి దేని వల్ల జబ్బులొస్తున్నాయన్న అంశాన్ని మాత్రం చెప్పలేదు. ప్రతి సర్వేలోనూ లైఫ్​స్టైల్​లో వచ్చిన మార్పులు, తిండి అలవాట్లే కారణమని డాక్టర్లు చెబుతున్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రోగుల గుర్తింపు, మందుల పంపిణీపైనే దృష్టి పెడుతున్నాయి. ఆ మేరకే పథకాలు రూపొందిస్తున్నాయి. రోగం రాకుండా ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్సర్​సైజులు చేయాలని చెబుతున్నాయి తప్ప, అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై పట్టించుకోవట్లేదు.

చాలా మారాలి

ఎన్​సీడీ నుంచి జనాన్ని కాపాడాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మార్పులు రావాలి. హెల్త్​ ఎడ్యుకేషన్​ను మెరుగు పరచాలి. పార్కుల సంఖ్య పెంచి, లంగ్​ స్పేస్​ ఇంప్రూవ్​ చేయాలి. కాలుష్య నియంత్రణకు, పంటల్లో పురుగుమందుల వాడకాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు అమలు చేయాలి. తిండి, నీళ్లు, పాలు కల్తీ అవకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. నేటి ఆధునిక కాలంలో పర్సనల్​ లైఫ్​ బాగా తగ్గిపోయింది. 8 గంటల పని రూల్​ అమలు కావట్లేదు. పని ఒత్తిడి, టార్గెట్ల వెనక పరిగెత్తడం పెరిగిపోయింది. చాలా మంది యువతకు బీపీ, షుగర్​ రావడానికి ఇదే కారణం. అదిది తగ్గాలంటే పని గంటల రూల్​ కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. పని వాతావరణం మారాలి. వ్యక్తులుగా ఎవరికివారు తమ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలి. తమకంటూ కొంత సమయం కేటాయించుకోవాలి. వ్యాయమం చేయాలి. జంక్​ఫుడ్​ అలవాట్లు మార్చుకోవాలి. – డాక్టర్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంజీవ్​ సింగ్​ యాదవ్​, ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్​ మాజీ సెక్రటరీ

out of a hundred  18  people in the state have BP and Sugar Diseases