పద్మశ్రీ అవార్డు గ్రహీత, సోషల్ యాక్టివిస్ట్ సునీతా కృష్ణన్ ఓటు తిరస్కరణకు గురికావడం చర్చనీయాంశంగా మారింది. 2026 అక్టోబర్ 9వ తేదీన ఆమెకు ఓటు ఎన్యూమరేషన్ రిజెక్ట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఫామ్ xxxxxx రిజెక్ట్ అయ్యింది అని ఎన్నికల సంఘం నుంచి మెస్సేజ్ వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.దీనికి సంబంధించిన ఎలాంటి కారణాలను ఎన్నికల సంఘం తెలుపలేదని అన్నారు.
అయితే సునీతా కృష్ణన్ ఎన్యూమరేషన్ ఫామ్ తిరస్కరణకు కారణం.. సర్ ప్రక్రియలో భాగంగా ఆమె ఎన్యూమరేషన్ ఫామ్ రిజెక్ట్ అయినట్లు తెలిపారు. 2002లో జరిగిన సర్ ప్రక్రియ సందర్భంగా ఆమె తన తల్లిదండ్రుల వివరాలను మ్యాపింగ్ చేయలేకపోయారని అందుకే రిజెక్ట్ అయినట్లు తెలిపారు.
బూత్ లెవెల్ ఆఫీసర్ వివరణపై సునీతా కృష్ణన్ స్పందించారు. 2002లో తనంతనట తాను ఓటు రిజిస్టర్ చేసుకోలేదని ఆమె చెప్పారు.
అయితే సర్ ప్రక్రియలో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ లో రెండు సెక్షన్లు ఉన్నాయి. ఒకటి 2002లో ఓటర్లు గా ఉన్నవారికోసం కాగా .. మరొకటి ఆ ఏడాదిలో మైనర్లుగా ఉన్న వారి ఓటు నమోదు సమయంలో తల్లిదండ్రుల వివరాలు ఇవ్వడం. చిన్న వయసులోనే ఇంటి నుంచి వెళ్లిపోవడంతో.. కుటుంబ సభ్యులతో తక్కువ సంబంధాలు ఉండటంతో ఆ సమయంలో పేరెంట్స్ డీటైల్స్ ఇవ్వలేకపోయినట్లు చెప్పారు.
అయితే మూడేళ్ల క్రితం తన భర్తతో కలిసి ఓటు రిజిస్టర్ చేసుకున్నట్లు చెప్పారు. అయితే ఆమె భర్త ఫామ్ కూడా రిజెక్ట్ అయినట్లు చెప్పారు.
గత కొన్నేళ్లుగా నేను ఓటర్ ఐడీ కార్డులను తీసుకోవడం మానేశాను. దీనికి కారణం ఇక్కడున్న రాజకీయ పార్టీలు. ఒకవేళ కార్డున్నా.. నేను నోటాకే ఓటు వేసేదాన్ని. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఓటు వేయకపోవడం అవమానకరమైన విషయమే.. కానీ ఇక్కడున్న పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు నా విషయమే ఒక ఉదాహరణ అంటూ పేర్కొన్నారు. ఈ దంపతులు 2024లో తొలిసారి ఓటు వేశారు.
ప్రస్తుత SIR ప్రక్రియలో భాగంగా, ఫామ్ లను పంపిణీ చేయడానికి లేదా సేకరించడానికి ఏ BLO (బూత్ స్థాయి అధికారి) వారి ఇంటికి రాకపోవడంతో, తమ వివరాల నమోదు ఫారమ్‌లను ఆన్‌లైన్‌లో సమర్పించారు. అయితే తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి 12 ప్రూఫ్ లలో ఏదైనా ఒకదానిని సమర్పించమని కోరుతూ, SIR అందించే నోటీసులు తమకు శ్రీమతి కృష్ణన్ తెలిపారు.
ఇప్పుడు, క్లెయిమ్‌లు, అభ్యంతరాలను దాఖలు చేసే గడువు ముగియడంతో, తుది జాబితాలో తిరిగి నమోదు కోసం ఫామ్ 6ను సమర్పించే అవకాశాన్ని ఆ దంపతులు కోల్పోయారు.
