సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తో సీజేపీ చేపట్టిన జంతర్ మంతర్ 2.O ఆందోళనతో ఢిల్లీ లోపల బయట రణరంగంలా మారింది. జంతర్ మంతర్ వెళ్లేందుకు వేల సంఖ్యలో కాక్రోచ్ పార్టీ మద్ధతు దారులు క్రమక్రమంగా ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్నారు. ఇప్పటికే వేలాది మంది నిరసనకారులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు.
మరోవైపు జంతర్ మంతర్ కు కాక్రోచ్ పార్టీ మద్ధతు దారులను రాకుండా అడ్డుకునేందకు పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ఢిల్లీ సరిహద్దుల్లో పూర్తి నిర్బంధాలు విధించడంతో.. వేలాది మంది బార్డర్లో ఆగిపోయారు. ఢిల్లీ సరిహద్దు్లు మరో జంతర్ మంతర్ ను తలిపిస్తున్నాయి.
జంతర్ మంతర్ లో నిరసనకు వస్తున్న ఆందోళన కారులను, కాక్రోచ్ పార్టీ మద్ధతు దారులను ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు పోలీసులు. ముళ్ల కంచెలు, సిమెంట్ దిమ్మెలతో కాక్రోచ్ లను అడ్డుకుంటున్నారు. అడుగడుగునా పోలీసులతో ఢిల్లీ పోలీసుల వయంగా మారిపోయింది.
కేంద్ర ఎన్నికల కమీషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ.. 2026 అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర సీజేపీ నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జంతర్ మంతర్ 2.O లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి కాక్రోచ్ లు, జెన్ జీలతో పాటు సీజేపీ మద్ధతు దారులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో అడుగడుగునా పోలీసు బలగాలతో యుద్ధవాతావరణం తలపిస్తోంది.
