ఉగ్రవాదంపై పాక్‌ చర్యలు తీసుకోవాలి: సుష్మా స్వరాజ్‌

ఉగ్రవాదంపై పాక్‌ చర్యలు తీసుకోవాలి: సుష్మా స్వరాజ్‌

ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు పాకిస్తాన్‌ చర్యలు తీసుకోవాలన్నారు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌. అబుదాబి లో జరుగుతున్నఇస్లామిక్ సహకార సంస్థ(OIC) సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆమె మాట్లాడారు. ఉగ్రవాదానికి మతం లేదన్నారు. మానవజాతిని కాపాడాలంటే ఉగ్రవాదానికి ఊతమిస్తూ నిధులు అందజేస్తున్న దేశాలు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు యుద్ధం, ఇంటెలిజెన్స్‌ ద్వారా ఉగ్రవాదంపై మనం విజయం సాధించలేమన్నారు సుష్మా.

శాంతికి దారి చూపే మార్గంగా భారత్‌ ఉందన్నారు. ఇండియాలో ఎన్నో మతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారని… ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటిగా నిలిచిందన్నారు. ప్రపంచంలోని భిన్నమైన దేశాల్లో భారత్‌ ఒకటి. అన్ని మతాల ప్రజలు సోదరభావంతో ఎంతో సామరస్యంగా కలిసిమెలిసి ఉంటారని తెలిపారు. మహాత్మాగాంధీ నడయాడిన ప్రదేశం నుంచి ఇక్కడికి వచ్చానన్న సుష్మా స్వరాజ్ .. అక్కడ ప్రతి ప్రార్థనా.. శాంతి అనే పదం పలికిన తర్వాతనే ముగుస్తుందన్నారు.