రహస్య అణు పరీక్షలు పాక్‌‌‌‌‌‌‌‌కు కొత్తేం కాదు ..ట్రంప్‌‌‌‌‌‌‌‌ కామెంట్లపై స్పందించిన భారత్‌‌‌‌‌‌‌‌

రహస్య అణు పరీక్షలు పాక్‌‌‌‌‌‌‌‌కు కొత్తేం కాదు ..ట్రంప్‌‌‌‌‌‌‌‌ కామెంట్లపై స్పందించిన భారత్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: దొంగచాటుగా న్యూక్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌లు చేయడం పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ అక్రమ చరిత్రకు సరిగ్గా సూట్‌‌‌‌‌‌‌‌ అవుతాయని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జైస్వాల్‌‌‌‌‌‌‌‌ మండిపడ్డారు. చీకటి ఒప్పందాలు, స్మగ్లింగ్‌‌‌‌‌‌‌‌, ఏక్యూ ఖాన్‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌, ప్రపంచ ఎగుమతి విధానాల అతిక్రమణలో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌కు ఇదివరకే రికార్డు ఉందన్నారు. ఆ దేశపు ఇలాంటి చీకటి కోణాలెన్నింటినో భారత్‌‌‌‌‌‌‌‌ అంతర్జాతీయ సమాజం ముందుకు తెస్తూనే ఉందని ఆయన గుర్తుచేశారు. పాక్‌‌‌‌‌‌‌‌ సీక్రెట్‌‌‌‌‌‌‌‌గా అణు పరీక్షలు చేస్తోందని ఇటీవల అమెరికా ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ డొనాల్డ్‌‌‌‌‌‌‌‌ ట్రంప్‌‌‌‌‌‌‌‌ చేసిన కామెంట్లపై స్పందిస్తూ రణధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జైస్వాల్‌‌‌‌‌‌‌‌ శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు.