పాక్ నీచబుద్ధి.. అభినందన్ బొమ్మలో టీ కప్ ఉంటే ఇంకా బాగుండేది

పాక్ నీచబుద్ధి.. అభినందన్ బొమ్మలో టీ కప్ ఉంటే ఇంకా బాగుండేది

న్యూఢిల్లీ: పాకిస్తాన్ మరోసారి తన నీచ బుద్ధిని బయటపెట్టుకుంది. ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ వింగ్​ కమాండర్​ అభినందన్​ వర్థమాన్​ బొమ్మను కరాచీలోని పాకిస్తాన్ ఎయిర్​ఫోర్స్(పీఏఎఫ్​)​ వార్​ మ్యూజియంలో పెట్టింది. పాక్​ జర్నలిస్టు, పొలిటికల్​ ఎనలిస్టు అన్వర్​ లోధి ట్విట్టర్​లో ఈ ఫొటోను పోస్ట్​ చేశాడు. దానికి ‘‘పీఏఎఫ్​ మ్యూజియంలో అభినందన్​ బొమ్మను పెట్టారు. అతడి చేతిలో టీకప్పు పెట్టిఉంటే   మరింత ఇంటరెస్టింగ్​గా ఉండేది”అని కామెంట్​ పెట్టాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ ఎఫ్​16ను వెంటాడుతూ మిగ్​ 21లో సరిహద్దు దాటిన అభినందన్​.. మిగ్​ కూలిపోవడంతో పాక్​ ఆర్మీ చేతికి చిక్కాడు. కస్టడీలో ఉన్న అభినందన్​కు సంబంధించి పాక్​ ఓ వీడియోను రిలీజ్​ చేసింది. ఆ టైమ్​లో అతను చేతిలో కప్పు పట్టుకుని టీ తాగుతూ కనిపించాడు. ఇప్పుడు లోధి పోస్ట్​ చేసిన ఫొటోలో ఓ గ్లాస్​ షోకేస్​లో అభినందన్​ బొమ్మ, అతడి వెనుక పాక్​ సోల్జర్​ బొమ్మ పెట్టారు. అభినందన్​ పక్కనే ఓ టీ కప్పు కూడా ఉంచారు. ఈ మధ్యనే క్రికెట్​ వరల్డ్​ కప్​ టోర్నీలో ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్​కు ముందు ఓ పాక్​ టీవీ చానల్​ అభినందన్​ను పాక్​ సోల్జర్లు పట్టుకునే సీన్​ను ఓ యాడ్​ కోసం వాడారు. అది టీవీల్లో టెలికాస్ట్ అయ్యింది. దీనిపై సోషల్​ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి.