భూమికి 3,215ఫీట్ల ఎత్తు లో బట్టలు ఆరేశిండు…

భూమికి 3,215ఫీట్ల ఎత్తు లో బట్టలు ఆరేశిండు…

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఆయన పేరు పాల్‌‌. ‘నలుగురు చేసేదే… నేనూ చేస్తే ఏం కిక్కుంటది?’ అంటున్నడీయన. నార్వే దగ్గర స్కాండినేవియన్ పర్వతాల్లో ‘క్జెరగ్‌‌’ పర్వతం ఉంది. ఇది సమ్మర్‌‌‌‌ టూరిస్ట్ స్పాట్‌‌. టూరిస్ట్‌‌లు ఈ పర్వతం ఎక్కి, పైన తాడు పట్టుకుని ఈ పక్క  నుంచి ఆ పక్కకు పోతరు. అందరిలెక్క నేను కాదని ముందే చెప్పిండుగా! రోప్‌‌ పట్టుకోని పోవడానికి బదులు నడుముకు తాడు కట్టుకుని రోప్‌‌ మీద నడిసిండు. ఇంకా కిక్కు  సరిపోలేదని భూమికి 980 మీటర్ల ఎత్తులో బట్టలు ఉతికి ఆరేసుకుండు. ఈయన వ్యవహారాన్ని ఫ్రెడ్‌‌ మారి తన కెమెరాలో బంధించిండు. దీనికి ఆయన  ‘నేషనల్‌‌ జియోగ్రాఫిక్‌‌ నేచర్‌‌‌‌ ఫొటోగ్రాఫర్‌‌‌‌ ఆఫ్‌‌ ది ఇయర్‌‌’‌‌ అందుకుండు. ‘బట్టలు ఆరేయడానికి భలే గొప్ప సాహసం చేసిండు రా’ అని అప్పట్ల ‘ఏరియల్‌‌’ డిటర్జెంట్‌‌ పౌడరోళ్లు ఈ ఫొటోను వాళ్ల వెబ్‌‌సైట్‌‌ల పోస్ట్ చేసుకున్రు!