సమ్మర్ లో బొప్పాయి ఫేస్ ప్యాక్ బెటర్

సమ్మర్ లో బొప్పాయి ఫేస్ ప్యాక్ బెటర్

ఎండాకాలంలో చర్మం తొందరగా పొడిబారుతుంది. మాయిశ్చర్​ తగ్గిపోవడంతో ముఖమంతా పాలిపోయినట్టు కనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ సీజన్​లో దొరికే బొప్పాయి పండుతో చేసిన ఫేస్​ప్యాక్ వేసుకుంటే చర్మం మునుపటిలా అవుతుంది. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు ట్యాన్​ని తగ్గిస్తాయి. చర్మానికి తేమని అందిస్తాయి అంటున్నాడు డెర్మటాలజిస్ట్ రింకీ కపూర్. 
కావాల్సినవి: బొప్పాయి పండు ముక్కలు– ఒక కప్పు, తేనె– రెండు టేబుల్ స్పూన్లు, చల్లని పాలు– రెండు టేబుల్ స్పూన్లు. తయారీ: బొప్పాయి పండు ముక్కలు, తేనె, పాలను మిక్సీలో మెత్తటి గుజ్జులా చేయాలి.  ఈ పేస్ట్​ని ముఖం, మెడ మీద రాసుకోవాలి. పావుగంట తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకుంటే చర్మం ఫ్రెష్​గా కనిపిస్తుంది.