Summer Food : యమ్మీ యమ్మీ బనానాతో అప్పం, కేక్ తయారీ ఇలా.. ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు..!

Summer Food : యమ్మీ యమ్మీ బనానాతో అప్పం, కేక్ తయారీ ఇలా.. ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు..!

అన్ని కాలాల్లో దొరుకుతూ... మన ఆరోగ్యానికి అండగా ఉండే పండు... 'అరటిపండు'. చాలారకాల ఆరోగ్య సమస్యలకు ఈ పండు ఫుల్స్టాప్ పెడుతుంది. తెలుసా! ఆరోగ్యానికి మంచిదని పిల్లలకూ అలాగే తినిపిస్తారు. అయితే పిల్లలు ఇష్టంగా ఏది తినాలన్నా, అది కొత్తగా ఉండాలి. అందుకే అరటిపండ్లతో కొత్తకొత్త వంటలు చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. మరెందుకు ఆలస్యం, ట్రైచేయండి.

అప్పం

కావాల్సినవి : బియ్యప్పిండి - ఒకటిన్నర కప్పుబెల్లం తరుగు - అర కప్పునీళ్లు - ఒకటిన్నర కప్పు అరటిపండు గుజ్జు - ఒక కప్పు ఎండు కొబ్బరి తురుము - అర కప్పు నెయ్యి - సరిపడా ఇలాచీ పొడి - అర టీ స్పూన్ బేకింగ్ సోడా - అర టీ స్పూన్ 

తయారీ : ముందుగా బెల్లం తరుగులో నీళ్లు పోసి మోస్తరు మంటపై పెట్టాలి. బెల్లం కరిగి పాకంగా మారాక, పావు కప్పు కొబ్బరి తురుము వేసి కలిపి పక్కన పెట్టాలి. మళ్లీ స్టవ్ వెలిగించి పాన్పెట్టి రెండు టీ స్పూన నెయ్యి వేయాలి. అది వేడెక్కాక మిగిలిన పావు కప్పు కొబ్బరి తురుము వేసి వేగించి, వేరే గిన్నెలోకి తీయాలి. తర్వాత పెద్ద గిన్నెలో బెల్లం పాకం, వేగించిన కొబ్బరి తురుము, ఇలాచీ పొడి, అరటిపండు గుజ్జు వేయాలి. 

బియ్యప్పిండి ఉండలు కట్టకుండా ఉండేందుకు... పిండి వేస్తున్నప్పుడు కలుపుతూనే ఉండాలి. చివరగా బేకింగ్ సోడా వేసి కలపాలి. తర్వాత స్టవ్ వెలిగించి, గుంత పొంగనాల గిన్నె పెట్టాలి. ఆ గుంతల్లో నెయ్యి లేదా నూనెను ముందే రాయాలి. ఇప్పుడు పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా గుంతల్లో వేసి ఉడికించాలి. మరోవైపు వేగేందుకు. కొద్దిసేపయ్యాక వాటిని తిప్పేయాలి.

కేక్ 

కావాల్సినవి : అరటిపండ్లు -నాలుగు గోధుమపిండి - ఒకటిన్నర కప్పు బేకింగ్ పౌడర్ - ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా - అర టీ స్పూన్ చక్కెర - అర కప్పు నూనె - ఒక టేబుల్ స్పూన్వెనిల్లా ఎసెన్స్-ఒక టీ స్పూన్ డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్, కిస్మిస్, చాకోబిప్స్ మొదలైనవి

తయారీ : అరటిపండు తొక్క తీసి ముక్కలుగాతరగాలి. వాటిని మిక్సీలో వేసి గ్రైండ్చేయాలి. ఆ గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో చక్కెర, నూనె, వెనిల్లా
ఎసెన్స్ వేసి బాగా కలపాలి. తర్వాతగోధుమ పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. మిశ్రమాన్నిఎంత బాగా కలిపితే, కేక్ అంతమృదువుగా వస్తుంది. చివరగాఅందులో డ్రైఫ్రూట్ ముక్కలు,చిప్స్ వేయాలి. ఇప్పుడు కేక్ పానికి నూనె రాసి మిశ్రమం వేయాలి. దాన్ని ఒవెన్లోపెట్టి 180 డిగ్రీల సెల్సియస్ వద్ద 45 నుంచి50 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి.