మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది'. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీ నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచేశాయి. అయితే లేటెస్ట్ గా వీరిద్దరి కాంబో పై మరో ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ముందే బుక్ చేసుకున్న చరణ్!
ఈ క్రేజీ కాంబోలో మరో సినిమా కూడా ఉందని టాక్ వినిపిస్తోంది. బుచ్చిబాబు వర్కింగ్ స్టైల్, కథా నేపథ్యంపై రామ్ చరణ్ విపరీతమైన ఆసక్తితో ఉన్నారట. బుచ్చిబాబు పనితీరుకు ఫిదా అయిన చరణ్, భవిష్యత్తులో కూడా ఆయనతో మరో ప్రాజెక్ట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే బుచ్చిబాబుకు చరణ్ అడ్వాన్స్ కూడా చెల్లించారని.., మరో పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని కోరారని టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది.
బర్త్ డే విష్‌తో వెల్లడైన బంధం
దర్శకుడు బుచ్చిబాబు సానా పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ తన సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. షూటింగ్ సెట్ నుండి ఒక అన్-సీన్ ఫోటోను షేర్ చేస్తూ.."నా 'పెద్ది' కెప్టెన్ బుచ్చిబాబు సానా గారికి జన్మదిన శుభాకాంక్షలు! మీ ప్యాషన్, ప్రతి చిన్న విషయాన్ని గమనించే తీరు, మట్టి వాసన ఉన్న కథలు చెప్పే విధానం రోజూ నాకు స్ఫూర్తినిస్తున్నాయి. మనం కలిసి మరిన్ని అద్భుతమైన కథలను సృష్టిద్దాం." అని పోస్ట్ చేశారు. దీనికి బుచ్చిబాబు కూడా అంతే భావోద్వేగంగా స్పందిస్తూ.. "సార్, మీ నుండి ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. ఎడిట్ రూమ్‌లో మీ నటన చూస్తుంటే మైమరిచిపోతున్నాను. 'పెద్ది' క్యారెక్టర్ ప్రజల గుండెల్లో ఏళ్ల తరబడి నిలిచిపోతుంది" అంటూ తన కృతజ్ఞతలు తెలిపారు.
Thank you so much for your warm wishes, sir 🙏🙏🙏❤️❤️❤️🤗
— BuchiBabuSana (@BuchiBabuSana) February 15, 2026
On this journey, I’m honestly learning something new from you every single day Sir. It’s been such a priceless experience for me. And every time I watch the film in the edit room, your performance just mesmerizes me all… https://t.co/LZ9qZOqKwB
విడుదల ఎప్పుడంటే?
'పెద్ది' మూవీ కేవలం స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ జర్నీగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, విలక్షణ నటుడు జగపతి బాబు, 'మీర్జాపూర్' ఫేమ్ దివ్యేందు శర్మ ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
బుచ్చిబాబు తన ప్రతి సినిమాను చాలా సహజంగా తీర్చిదిద్దుతారు. ఈ సినిమాలో కూడా చరణ్‌ను మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో, మాస్ అవతార్‌లో మనం చూడబోతున్నాం. భారీ బడ్జెట్‌తో, మైత్రీ మూవీ మేకర్స్,సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
