ప్రపంచంలోనే తొలి AI మహాశివరాత్రి... 50 నిమిషాల్లో ఐదు వేల 700 పాటలు...

ప్రపంచంలోనే తొలి AI మహాశివరాత్రి... 50 నిమిషాల్లో ఐదు వేల 700 పాటలు...

ప్రతి రంగంలో AI దూసుకుపోతోంది. ఇక క్రియేటివ్ రంగంలో AI చేస్తున్న అద్భుతాల గురించి ఎంత చెప్పిన తక్కువే అనిపిస్తుంది. హైదరాబాద్ లోని ఓ ఏఐ అకాడమీ అరుదైన ఘనత సాధించింది. ఆదివారం ( ఫిబ్రవరి 15 ) మహాశివరాత్రి సందర్భంగా సూపర్ AI అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన AI మహాశివరాత్రి – డిజిటల్ నాద యజ్ఞం కార్యక్రమం సక్సెస్ అయినట్లు తెలిపారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 500 మందికి పైగా భక్తులు పాల్గొని కేవలం 50 నిమిషాల్లో 5,700కుపైగా తెలుగు శివ భక్తి గీతాలను సృష్టించినట్లు తెలిపారు.

మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించిన ఈ డిజిటల్ నాదయజ్ఞం Zoom వెబినార్ వేదికగా జరిగిందని తెలిపారు. పాల్గొన్న భక్తులు ChatGPT, Custom GPT సహాయంతో శివునిపై సాహిత్యం రూపొందించగా, AI ఆధారిత మ్యూజిక్ టూల్స్ తో భక్తి గీతాలను స్వరపరిచారని... ఈ కార్యక్రమం వాణిజ్య లక్ష్యాలతో కాకుండా, భక్తి సమర్పణగా నిర్వహించినట్లు తెలిపారు.

శివుడు, రుద్రుడు, నటరాజ, అర్ధనారీశ్వర, లింగోద్భవం, శివతాండవం వంటి మహాదేవుని విభిన్న రూపాలపై పాటలు క్రియేట్ చేశారని వెల్లడించారు. భక్తులు క్రియేట్ చేసిన అన్ని పాటలు తెలుగులోనే ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమం కొనసాగింపుగా 5,700కుపైగా గీతాలలో 108 గీతాలను ఎంపిక చేసి ఈరోజు రాత్రి 10 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు SUPER AI కమ్యూనిటీ సభ్యుల కోసం డిజిటల్ జాగరణ ప్రత్యేక Zoom ప్రసారంగా వినిపించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీనిని డిజిటల్ నాదార్పణగా భావిస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమం ఇంపాక్ట్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించామని.. ప్రొఫెసర్ గంపా నాగేశ్వరావు, ఇంపాక్ట్ ఫౌండేషన్ ట్రెజరర్ గంపా ఆదిత్య భరత్ ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారని అన్నారు. సూపర్ ఏఐ అకాడమీ కోర్ టీమ్ సభ్యులు దాసా అఖిల్, అక్షయ్ కుమార్, సుమంత్, శ్రీధర్ స్వామి, జయశ్రీ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు నిర్వాహకులు.

సూపర్ ఏఐ అకాడమీ వ్యవస్థాపకుడు నికీలూ గుండా మాట్లాడుతూ, “AI సాంకేతికతను సమాజానికి, సంస్కృతికి ఉపయోగపడేలా మార్చడం మా లక్ష్యమని... భక్తి, టెక్నాలజీ కలిసి పనిచేయగలవని ఈ కార్యక్రమం నిరూపించిందని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.