న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఆదివారం (ఫిబ్రవరి 15) జరిగిన గ్రూప్–ఎ మ్యాచ్‌లో టీమిండియా 61రన్స్ తేడాతో పాక్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. మహాశివరాత్రి పర్వదినాన జరిగిన మెగా సమరంలో టీమిండియా రుద్రరూపం ముందు దాయాది జట్టు బెంబేలెత్తిపోయింది.
శ్రీలంక గడ్డపై యంగ్ సెన్సేషన్ ఇషాన్ కిషన్ (40 బాల్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77) షాన్‌దార్ బ్యాటింగ్‌తో శివాలెత్తగా.. మరోవైపు బౌలర్లు సమిష్టిగా రాణించి ఈ హై-ఓల్టేజ్ పోరులో 61 రన్స్ తేడాతో పాకిస్తాన్‌ను భారత్ మట్టికరిపించింది. గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలతో సూర్యకుమార్ సేన సూపర్-8కు దూసుకెళ్లింది.
వరల్డ్ కప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై భారత్ ఏకపక్ష విజయం సాధించడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్న వేళ భారత జట్టులో విభేదాలు తలెత్తాయి. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మధ్య మనస్పర్ధాలు చోటు చేసుకున్నాయి. దీనికి అంతటికి కారణం ఒక్క క్యాచ్ మిస్ కావడమే.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
పాకిస్తాన్ జట్టు ఛేజింగ్‌లో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా18 ఓవర్ బౌలింగ్ చేశాడు. అప్పటికే పాకిస్తాన్ తొమ్మిది వికెట్లు కోల్పోయింది. క్రీజులో టాయిలెండర్లు షాహీన్ షా అఫ్రిదీ, తారిఖ్ రెహ్మాన్ ఉన్నారు. ఈ క్రమంలో హార్దిక్ వేసిన 18 ఓవర్ రెండో బంతికి షాహీన్ షా అఫ్రిదీ లాంగ్-ఆన్ వైపు మీదుగా భారీ షాట్ ఆడాడు. బౌండ్రీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తోన్న కుల్దీప్ క్యాచ్ మిస్ చేశాడు.
బంతి కుల్దీప్ చేతిలోనుంచి మిస్ అయ్యి డైరెక్ట్ బ్రౌండీ లైన్ అవతల పడటంతో పాకిస్తాన్ కు 6 పరుగులు వచ్చాయి. కుల్దీప్ క్యాచ్ మిస్ చేయడంపై కెప్టెన్ సూర్య, బౌలర్ హార్ధిక్ పాండ్యా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హర్ధిక్ పాండ్యా రెండు, మాటలు కూడా వదిలాడు.
ఈ పరిణామంతో కుల్దీప్ అలిగాడు. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సమయంలో కుల్దీప్ సూర్యకు షేక్ హ్యాండ్ ఇచ్చి పట్టించుకోకుండానే వెళ్లిపోయాడు. కుల్దీప్ తీరుపై సూర్య ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు.
కొందరు సమర్ధిస్తుంటుంటే.. ఇంకొందరు విమర్శిస్తున్నారు. ఇండియా, పాక్ లాంటి హై ఓల్టేజ్ మ్యాచులో ఆటగాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఫీల్డింగ్ చేయాలని.. ఒక్క క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఆట అన్నాక చిన్న చిన్న తప్పిదాలు కామన్ అని.. దానికి మరీ అంత ఓవర్ గా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదని ఇంకొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలో ఆటగాళ్ల మధ్య విభేదాలు జట్టుకు మంచిది కాదంటున్నారు క్రీడా విశ్లేషకులు.
