చాలామంది కొలెస్ట్రాల్ పెరుగుతుందని గుడ్డులోని పచ్చసొన తీసేసి కేవలం తెల్లసొన మాత్రమే తింటుంటారు. కానీ ప్రముఖ ఢిల్లీ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రకారం ఇదంతా వాస్తవం కాదని, తప్పుడు పద్ధతి అని చెబుతున్నారు. ప్రకృతి గుడ్డును తెల్లసొన, పచ్చసొన కలిపి ఇచ్చింది. తెల్లసొన మాత్రమే తింటే అది శరీరంలో మంటకు కారణం కావచ్చు. అదే పచ్చసొనతో కలిపి తింటే అది పోషకాల నిధిగా మారుతుంది.
గుడ్డు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనేది ఒకప్పటి పాతకాలపు మాట. తాజా పరిశోధనల ప్రకారం, మనం తినే ఆహారం కంటే మన శరీరమే 85% కొలెస్ట్రాల్‌ను సొంతంగా తయారు చేసుకుంటుంది. కాబట్టి గుడ్డు పచ్చసొనతో పెద్ద ప్రమాదం లేదు. గుడ్డులో ఉండే విటమిన్ ఎ, ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, బి-కెరోటిన్ వంటి పోషకాలన్నీ పచ్చసొనలోనే ఉంటాయి. దానిని తీసేయడం వల్ల మీరు మంచి పోషకాలను కోల్పోతారు.
కేవలం తెల్లసొన మాత్రమే తినడం వల్ల బయోటిన్ లోపం, ఆర్థరైటిస్ అంటే కీళ్ల నొప్పులు, లీకీ గట్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సరిగ్గా ఉడకని తెల్లసొన వల్ల సాల్మొనెల్లా బ్యాక్టీరియాతో ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.
డాక్టర్ సలహా ఏంటంటే :
గుడ్డును పూర్తిగా తెల్లసొన, పచ్చసొన కలిపి తినండి. ముఖ్యంగా ఊర్లల్లో, పంట పోలాళ్ళల్లో పెరిగే కోళ్ల (Organic/Free-range eggs) గుడ్లను తీసుకోండి. ఎండలో స్వేచ్ఛగా తిరిగే కోళ్ల గుడ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
