చెన్నూరు మున్సిపల్ పీఠం కాంగ్రెస్ దే.. చైర్ పర్సన్ గా పద్మ

 చెన్నూరు మున్సిపల్ పీఠం కాంగ్రెస్ దే.. చైర్ పర్సన్ గా పద్మ

మున్సిపాలిటీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక కొనసాగుతోంది. మెజారిటీ మున్సిపాలిటీలను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఛైర్ పర్సన్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది.   చైర్ పర్సన్ గా పెద్దింటి పద్మ, వైస్ ఛైర్మన్ గా వినయ్  ఎన్నికయ్యారు. దీంతో చెన్నూరు మున్సిపాలిటీలో  నూతన పాలక వర్గం కొలువు దీరింది. 

మున్సిపాలిటీలో చైర్ పర్సన్  గా పెద్దింటి పద్మ, వైస్ చైర్మన్ గా వినయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చెన్నూరు పట్టణంలో డీజే డ్యాన్సులు, బాణాసంచాలు కాల్చి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు చైర్ పర్సన్, వైస్ చైర్మన్.  పట్టణంలోని పాత బస్ స్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు సభ్యులు.వివేక్ వెంకటస్వామి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతఙ్ఞతలు తెలిపారు చైర్ పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్మన్ వినయ్. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.