- భద్రాచలం వైపు నుంచి బోట్లు తిప్పేందుకు
- ఏపీ టూరిజం శాఖ గ్రీన్ సిగ్నల్
భద్రాచలం, వెలుగు: పోచవరం నుంచి పాపికొండల టూర్ కు లైన్ క్లియర్అయ్యింది. బోట్లు నడుపుకునేందుకు ఏపీ టూరిజం శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో రేపటి నుంచి గోదావరి విహారయాత్ర షురూ కానుంది. అక్టోబరు 7 నుంచి రాజమండ్రి – పాపికొండల టూర్ మొదలవ్వగా, తెలంగాణలోని భద్రాచలం వైపు ఉన్న ఏపీలో విలీన గ్రామమైన పోచవరం నుంచి ప్రారంభించేందుకు అనుమతులు ఇవ్వలేదు. ఏపీ టూరిజం డివిజనల్మేనేజర్వీరనారాయణ పోచవరం వద్ద బోట్లు బయలుదేరే ప్రాంతం, బోట్లను తనిఖీ చేసి రెండు నెలల తర్వాత బోట్లు నడుపుకునేందుక ఓకే చెప్పారు. 18 నుంచి స్టార్ట్చేసేందుకు పర్మిషన్ఇచ్చారు. దీంతో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఇక నుంచి పాపికొండల అందాలు చూసొచ్చే వీలు కలిగింది. పాపికొండల టూర్స్టార్ట్అయితే భద్రాద్రికి వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది. 2019 సెప్టెంబరు 15న తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు టూరిస్టు బోటు మునిగిపోవడంతో పాపికొండల యాత్ర నిలిపివేశారు. రెండేళ్ల తర్వాత తిరిగి స్టార్ట్అవుతోంది.
డైలీ 8 బోట్లు తిరగనున్నయ్
భద్రాచలం వైపు నుంచి మొత్తం 14 బోట్లు ఉండగా ప్రస్తుతం 8 మాత్రమే పూర్తిస్థాయి ఫిట్‍నెస్‍తో ఉన్నాయి. పోర్టు ఆఫీసర్ల రైల్స్ ప్రకారం లైఫ్‌జాకెట్లు, గజ ఈతగాళ్లు, 20 మందికి ఒక బోయెంట్, 10 మందికి ఒక బోయాస్ఆపరేటర్, ఆరు అగ్ని ప్రమాద నిరోధక యంత్రాలు ఉండాలని కండిషన్లు పెట్టారు. టూరిస్టు తప్పనిసరిగా లైఫ్జాకెట్ధరించాలనే రూల్విధించారు. అవన్నీ ఉన్న 8 బోట్లను ఈ నెల 18వ తేదీ నుంచి పాపికొండలయాత్రకు అనుమతించారు. పెద్దలకు ఒకరికి రూ.930, 5 నుంచి 10 ఏళ్ల లోపు ఉన్న చిన్నారికి రూ.730, కాలేజీ స్టూడెంట్లకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.830గా టిక్కెట్ ధర నిర్ణయించారు.
వెళ్లే వాళ్లకి ఇవి తప్పనిసరి
పాపికొండల యాత్రకు వెళ్లే ప్రతీ టూరిస్టు పేరు, ఆధార్‍కార్డు నంబరు, ఊరు, పూర్తి అడ్రస్, ఫోన్‌నంబరును బోటు యజమానులు తీసుకుంటారు. బోటు సామర్థ్యాన్ని బట్టి టూరిస్టులను ఎక్కిస్తారు. టూరిస్టుల భద్రత కోసం ఏర్పాటు చేసిన కమాండ్కంట్రోల్ సెంటర్ల నుంచే బోట్లు బయలుదేరుతాయి. టూరిస్టుల వివరాలు పోలీసు, రెవెన్యూ, టూరిజం శాఖ వద్ద ఉంటాయి.
