బస్సు రాలేదనే సాకుతో విమానం డోర్ తెరవలె.. ఇండిగో యాజమాన్యం నిర్లక్ష్యంపై  ప్రయాణికులు ఆగ్రహం

బస్సు రాలేదనే సాకుతో విమానం డోర్ తెరవలె..  ఇండిగో యాజమాన్యం నిర్లక్ష్యంపై  ప్రయాణికులు ఆగ్రహం

తిరుపతి నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఇండిగో యాజమాన్యం నిర్లక్ష్యంపై  ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.   దాదాపు 45 నిమిషాల పాటు ప్రయాణికులకు కిందకు దిగనీయకుండా రన్‌వేపైనే విమానాన్ని నిలిపివేశారు అధికారులు. ప్రయాణికులను తీసుకెళ్లేందుకు బస్సు ఇంకా రాలేదని విమానం డోర్‌ కూడా తెరవలేదు, దీంతో ప్రయాణికులు దాదాపు గంటపాటు విమానంలోనే ఉండి ఇబ్బంది పడ్డారు. దీంతో ఇండిగో అధికారుల తీరుపై ప్రయాణికుల ఆగ్రహం చేశారు.  

మరోవైపు అస్సాంలోని గువాహటి నుంచి దిబ్రూగఢ్‌ బయలుదేరిన ఇండిగో విమానం ఇంజిన్లో సమస్య తలెత్తడంతో తిరిగి గువాహటి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ విమానంలో  ప్రయాణికులతో పాటుగా కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి రామేశ్వర్‌ తెలీ, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశాంత ఫుకన్, తెరష్ గోవాళ్లతో సహా 150 మంది ప్రయాణిస్తున్నారు.