PATHAAN: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న పఠాన్..తొలిరోజే రూ.100 కోట్లు

PATHAAN: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న పఠాన్..తొలిరోజే రూ.100 కోట్లు

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. పఠాన్  తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ.106 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్లో తెలిపారు. ఓపెనింగ్  రోజే హిందీలో రూ.55 కోట్లు సాధించి ఓపెనింగ్స్ లో కేజీఎఫ్ 2 ను దాటేసిందని చెప్పాడు.  తొలి రోజు కేజీఎఫ్ -2 రూ. 53.95 కోట్లు రాబట్టింది.  తెలుగు, తమిళంలో  రూ.2 కోట్లు కలిపి పఠాన్ మొత్తం తొలిరోజు ఇండియాలో 57 కోట్లు రాబట్టిందని ట్వీట్ చేశాడు. ఇక ఇవాళ రిపబ్లిక్ హాలిడే కావడంతో హిందీలోనే ఈ మూవీ రూ.100 కోట్లు  దాటే అవకాశముందన్నాడు

దీపిక పదుకొణె హీరోయిన్గా నటించిన ఈ మూవీకి సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించగా.. మరో ప్రధాన పాత్రలో బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం నటించాడు. శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే అందించగా.. ప్రముఖ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు.