Unstoppable2 : రికార్డులు బద్దలుకొట్టిన బాలయ్య – పవన్ కళ్యాణ్ ఎపిసోడ్

Unstoppable2 : రికార్డులు బద్దలుకొట్టిన బాలయ్య  – పవన్ కళ్యాణ్ ఎపిసోడ్

పవన్ కళ్యాణ్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అన్ స్టాపబుల్ ఎపిసోడ్ వచ్చేసింది. గురువారం రాత్రి (ఫిబ్రవరి 2) 9 గంటలకు ఆహాలో విడుదలైన ఈ పవర్ ప్యాక్ ఎపిసోడ్ కు ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఈ దెబ్బతో.. ప్రభాస్ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ను పవన్ అభిమానులు బద్దలు కొట్టారు. ఇదివరకే విడుదలైన ఈ ఎపిసోడ్ గ్లిప్స్, ప్రోమో.. పవన్ మేనియాను రెట్టింపు చేశాయి. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కు తగ్గట్టే ఎపిసోడ్ కూడా ఉంది. 

ఇద్దరు టాప్ మోస్ట్ సీనియర్ హీరోలు ఒకే వేదికపై కనిపించడం ఇదే తొలిసారి. ఎప్పటిలాగే బాలయ్య చేసిన అల్లరి ఈ ఎపిసోడ్ కు ప్లస్ పాయింట్. బాలయ్య అడిగిన క్వశ్చన్స్ కు పవన్ ఇచ్చిన పంచ్, ఫన్నీ వన్ లైన్ జవాబులు ఆడియన్స్ ను అలరించాయి. హాట్ టాపిక్ గా ఉన్న పవన్ మూడు పెళ్లిళ్లకు ఇందులో జవాబు దొరికింది. దీని గురించి బాలయ్య అడగగా.. ఇద్దరి భార్యలకు చట్ట ప్రకారం విడాకులిచ్చాకే మూడో పెళ్లి చేసుకున్నానని పవన్ కళ్యాణ్ జవాబిచ్చాడు. 

ఈ ఎపిసోడ్ లో పవన్ వ్యక్తిగత జీవితం, రాజకీయాలు, తర్వాత చేయబోయే సినిమాల గురించి ముచ్చటించారు. పవన్ ప్రస్తుతం నటిస్తున్న హరిహరవీరమల్లులోని హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ ఎపిసోడ్ లో వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది. సర్ప్రైజ్ గా సాయి ధరమ్ తేజ్ ఎంట్రీ ఇస్తాడు. ఆహా.. రెండవ ఎపిసోడ్ గురించి ‘పవర్ స్ట్రోమ్ లోడింగ్ సూన్’ అని హింట్ ఇచ్చారు.