హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ఏమన్నా రేవం త్ రెడ్డి జాగీరా? అని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని హైదరాబా ద్ రాకుండా చేస్తామని సీఎం ఎలా అంటారని ప్రశ్నించారు. సోమవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నట్లు, కిషన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నట్లు అనిపిస్తోందని విమర్శించారు.
గతంలో బీఆర్ఎస్ కు పట్టిన గతే రేవంత్ కు పడుతుందని, బెంగాల్ లో మమతా బెనర్జీ పరిస్థితి ఏమైందో ఒకసారి చూసుకోవాలని హెచ్చరించారు. ప్రతి విషయంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కేవలం తిట్ల దండకంతోనే రాజకీయం చేయాలని చూస్తే ప్రజలు బుద్ధి చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్ని విధాలా సహకరిస్తోందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని పాయల్ శంకర్ ఆరోపించారు. దేశం మొత్తం మీద సగం ధాన్యం తెలంగాణ నుంచే కొనుగోలు చేసిందన్నారు.
