తెలంగాణ అంటే నిజాంల పైజాంలు ఊడగొట్టిన గడ్డ

V6 Velugu Posted on Sep 17, 2021

మరో 19 నెలల్లో సోనియమ్మ రాజ్యం వస్తదన్నారు టీపీసీీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గజ్వేల్ జరిగిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభలో మాట్లాడిన రేవంత్ .. సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన రోజన్నారు. ఎత్తిపోతల పథకం తెస్తానన్న కేసీఆర్ రోజూ మద్యం ఎత్తుతుండు  పోస్తుండన్నారు. యాదాద్రిలో ఉత్సవాలు చేస్తే ఎట్ల మంది వస్తరో..ఇవాళ గజ్వెల్ సభకు 2లక్షల మంది వచ్చినమన్నారు. రెండు లక్షలకు ఒక్క తల కూడా తక్కు ఉందో లేదో ఇక్కడున్న ఇంటలిజెన్స్ అధికారులు లెక్కపెట్టుకోవాలన్నారు. ఒకవేళ సంఖ్య తక్కువైతే మరో ఆరు నెలల్లో ఇదే గడ్డపై 5 లక్షల మందితో కదం తొక్కుతామన్నారు.  తెలంగాణ అంటే పిడికెడు మట్టి కాదు..ఎంతో మందికి పాఠం నేర్పిన గడ్డని..తెలంగాణ అంటే నిజాంల పైజాంలు ఊడగొట్టిన గడ్డని..తెలంగాణ అంటే దొరల గడీలను బద్దలు కొట్టిన గడ్డ అని అన్నారు.

కేసీఆర్ రెండు సార్లు గజ్వెల్ లో గెలిచి ముఖ్యమంత్రి  మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ను తీసుకొచ్చారన్నారు.మల్లన్నసాగర్ లో 60 వేల ఎకరాల్లో భూమిని గుంజుకుని 14 గ్రామాలను నట్టేట ముంచిండన్నారు. కొండపోచమ్మ దగ్గర కేసీఆర్ తన బంధువు అయిన భాస్కర్ రావు భూమిని కాపాడడానికి పేదోళ్ల భూమిని  గుంజుకుండన్నారు.  సోనియమ్మ రాజ్యం వస్తే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఇంట్లో నాలుగు మంత్రి పదవులు ఇచ్చుకుని.. 12 శాతం ఉన్న మాదిగలకు  ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు.

దళిత గిరిజన బిడ్డలకు గొర్రెలు,బర్రెలు,  కేసీఆర్ మనవడు తినే సన్నబియ్యం కాదని...కేసీఆర్ మనవడు చదివే స్కూళ్లో చదివి ప్రయోజకులయ్యేలా చూడాలన్నారు.  ఆరోగ్యశ్రీని రూ.5లక్షలకు పెంచాలన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత విద్యను అందించాలన్నారు. పేదోడికి విద్యను దూరం చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అని అన్నారు. మైనార్టీలను కూడా మోసం చేశారన్నారు. ఎస్సీలకు లక్ష కోట్ల బకాయిలు కట్టకపోతే కేసీఆర్ ఇల్లు అర్లాస్ పెడతాం..తలుపులు పగలగొడ్తామన్నారు. తండ్రి తాగుబోతులకు బ్రాండ్ అంబాసిడర్ అయితే..కొడుకు డ్రగ్స్ తీసుకునే వాళ్లకు బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. గజ్వేల్ అభివృద్ధి గీతారెడ్డి హయాంలో జరిగిందన్నారు. 

సింగరేణిలో కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం జరిగితే ఏడు రోజులైనా కేసీఆర్ అధికారులతో సమీక్ష జరపలేదని..అరెస్ట్ చేయాలని ఆదేశాలివ్వలేదన్నారు. ఏడు లక్షల సీసీ కెమెరాలున్నా ఏడురోజులైనా నిందితుడిని పట్టుకోలేదన్నారు. 19 నెలల్లో సోనియమ్మ రాజ్యం వస్తదని....పంజాగుట్టలో పాతిక అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని కాంగ్రెస్ పెడుతుందన్నారు. . తెలంగాణ యువత కోసం అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు నిరుద్యోగ యువత కోసం కార్యాచరణను చేపడతామన్నారు. పరేడ్ గ్రౌండ్ లో ధర్మ యుద్ధం చేస్తామన్నారు రేవంత్.

Tagged KTR, KCR, pcc chief revanth reddy, Gajwel, dalitha girijana sabha, soniyagandhi

Latest Videos

Subscribe Now

More News