Samantha: ఒకవైపు ప్రెగ్నెన్సీ రూమర్స్.. మరోవైపు ‘మా ఇంటి బంగారం’ రికార్డ్ కలెక్షన్స్

Samantha: ఒకవైపు ప్రెగ్నెన్సీ రూమర్స్.. మరోవైపు  ‘మా ఇంటి బంగారం’ రికార్డ్ కలెక్షన్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు ఆమె నటించి, నిర్మించిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తూ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటుండగా.. మరోవైపు ఆమె ప్రెగ్నెన్సీ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో సమంత కెరీర్లో రెండు ముఖ్యమైన ఘట్టాలుగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ప్రెగ్నెన్సీ రూమర్లపై సమంత లేదా ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ నిజమే అన్నట్టుగా బేబీ బంప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ దూకుడు..

‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.13.15 కోట్ల గ్రాస్ వసూళ్లతో హయ్యెస్ట్ ఓపినింగ్ సాధించింది. ఈ నేపథ్యంలోనే రెండో రోజు శనివారం (జూన్ 21న) అదిరిపోయే వసూళ్లు అందుకుంది. ఈ సందర్భంగా ‘మా ఇంటి బంగారం’ వరల్డ్ వైడ్గా రూ.28 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంటే శనివారం ఒక్కరోజే సామ్ సినిమాకు రూ.15 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.41 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇక ఇవాళ మూడు రోజుతో రూ.50 కోట్ల క్లబ్లో చేరనుంది.

ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ‘మా ఇంటి బంగారం’ సత్తా చాటుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాకు విశేష ఆదరణ లభిస్తోంది. వీకెండ్ కావడంతో ఆదివారం కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న స్పందనను బట్టి చూస్తే.. మూడో రోజు ముగిసే సమయానికి ‘మా ఇంటి బంగారం’ ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమంత నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగానూ సక్సెస్ అందుకునే దిశగా దూసుకెళ్తోంది.

►ALSO READ | Prabhas: చంచల్‌గూడ జైలులో ప్రభాస్.. హైప్తో పోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ సందీప్!

ఇండియాలో రూ.13.32 కోట్ల నెట్

నెట్ కలెక్షన్ల పరంగా చూస్తే.. తొలి రోజు శుక్రవారం రూ.5.35 కోట్లు, రెండో రోజు శనివారం రూ.7.50 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.13.32 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదు చేసింది.

రాష్ట్రాల వారీగా చూస్తే..

తెలంగాణ – రూ.6.84 కోట్లు
ఆంధ్రప్రదేశ్ – రూ.4.25 కోట్లు
కర్ణాటక – రూ.2.40 కోట్లు
తమిళనాడు – రూ.1.45 కోట్లు
మిగతా ప్రాంతాలు – రూ.29 లక్షల చొప్పున వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.   

మా ఇంటి బంగారం ఓవర్సీస్ కలెక్షన్స్..

‘మా ఇంటి బంగారం’ ఓవర్సీస్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అమెరికా, కెనడాల్లో ఇప్పటివరకు ఈ చిత్రం 850K డాలర్లు (సుమారు రూ.8 కోట్లు) వసూలు చేసినట్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రత్యంగిరా మూవీస్ వెల్లడించింది. ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 260K డాలర్లు (రూ.2.45 కోట్లు) రాబట్టిన ఈ చిత్రం, మూడో రోజు 300K డాలర్ల మార్క్‌ను దాటే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఈ వీకెండ్‌లోనే ‘మా ఇంటి బంగారం’ నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.