V6 News

కుంట్లూరులో హైడ్రా కూల్చివేతలు.. ఉద్రిక్తత..పెద్ద అంబర్పేట్ పరిధిలో ఘటన

కుంట్లూరులో హైడ్రా కూల్చివేతలు.. ఉద్రిక్తత..పెద్ద అంబర్పేట్ పరిధిలో ఘటన

ఎల్బీనగర్, వెలుగు: పెద్ద అంబర్​పేట్ పరిధిలోని కుంట్లూరు ప్రజయ్ గుల్మహార్ గేటెడ్ కమ్యూనిటీలో బుధవారం హైడ్రా కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీశాయి. కాలనీవాసులు రోడ్డు కబ్జా చేశారంటూ అగర్వాల్ అనే వ్యక్తి హైడ్రా కమిషనర్ రంగనాద్​కు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై హైడ్రా అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టి, హైకోర్టు ఆదేశాల మేరకు ఇన్​స్పెక్టర్ సైదులు ఆధ్వర్యంలో కూల్చివేతలకు వచ్చారు. అయితే, కాలనీ జనం గేటు దగ్గరే బైఠాయించి హైడ్రా అధికారులను, పోలీసులను లోపలికి రానివ్వకుండా సుమారు రెండు గంటల పాటు అడ్డుకున్నారు. చివరకు హయత్ నగర్ సీఐ నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఆందోళనకారులను పక్కకు తరిమేసి, గేటెడ్ కమ్యూనిటీ ప్రహరీ గోడను కూల్చివేశారు.