మోత మొదలైంది.. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు

మోత మొదలైంది.. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. 2026 మే 15వ తేదీన ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్, డీజిల్ పై దేశ వ్యాప్తంగా 2.83 నుంచి 3.29  రూపాయల వరకు ధరలు పెంచాయి కంపెనీలు. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. 

పెంచిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 94.77 నుంచి 97.77 రూపాయలకు పెరిగింది. అదే విధంగా డీజిల్ 87.67 నుంచి 90.67 రూపాయలకు పెరిగింది. 

 వివిధ మెట్రో సిటీలో పెట్రోల్ డీజిల్ ధరలు 2.83 నుంచి 3.29 రూపాయలకు పెరగటంతో ధరలు ఇలా ఉన్నాయి. కోల్ కతాలో రూ.108.74 కు పెరిగింది. ముంబైలో 103.67,  చెన్నై లో  103.67 గా ఉంది.

ఎన్నికల హడావుడి పూర్తయ్యింది. ఫలితాలు వచ్చి ప్రభుత్వాలు కొలువుదీరాయి. మొన్నటి వరకు ధరలు పెంచేది లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వచ్చినా.. ఎట్టకేలకు ధరల పెంపుకు కంపెనీలకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో కంపెనీలు ధరలు పెంచేశాయి. 

హైదరాబాద్లో ధరలు:

హైదరాబాద్ లో లీటర్ డీజిల్ ధర 2026 మే 14న 95.7 గా ఉంది. పెరిగిన ధరలతో 98.96 కు చేరుకుంది.  సిటీలో డీజిల్ పై 3.26 రూపాయలు పెరిగింది.

ఇక పెట్రోల్ ధర లీటర్ కు 107.50 గా ఉంది. సిటీలో పెట్రలో ధర లీటరు పైన 3.39 రూపాయలకు పెరిగింది. దీంతో లీటరు ధర 110.89 కు చేరుకుంది.