పెట్రోల్, డీజిల్ ధరలు మళ్ళీ పెరిగాయి. నాలుగురోజుల క్రితమే పెట్రోల్, డీజిల్ ధరలు రూ.3 మేర పెరిగిన సంగతి తెలిసిందే. మంగళవారం ( మే 19 ) దేశవాప్తంగా పెట్రోల్, డీజిల్ పై సుమారు 90 పైసలు పెంచింది కేంద్రం. నాలుగు రోజుల్లోనే రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో గగ్గోలు పెడుతున్నారు వాహనదారులు. మే 15న పెట్రోల్, డీజిల్ ధరలు రూ.3 పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.111.79కి, డీజిల్ ధర రూ. 99.86కి చేరింది.
ఇక ఏపీలోని విజయవాడలో పెట్రోల్ ధర తాజా పెంపుతో 114.48కి చేరగా... డీజిల్ ధర తాజా పెంపుతో రూ.102.12 కి చేరింది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.112. 57కి చేరగా.. డీజిల్ ధర రూ.100.31కి చేరింది. దీంతో 5 రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు సుమారు రూ.5 మేర పెరిగింది.
ఇటీవల ప్రధాని మోడీ ఇంధనం పొదుపు చేయాలంటూ పిలుపునిచ్చిన వారం రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఈ రేంజ్ లో పెరగడం సామాన్యుడికి పెద్ద షాక్ అనే చెప్పాలి. అయితే..కొద్ది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు సుమారు రూ.30 వరకు పెరిగే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్న క్రమంలో ఆందోళన చెందుతున్నారు ప్రజలు. ఇంధన ధరలు ఇలా పెరుగుతూ పోతే సామాన్యుడిపై భారం పడుతుందని... ధరలు నియంత్రించేలా కేంద్రం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు ప్రజలు.
