ఎస్బీఐ కస్టమర్లకు పీఐబీ కీలక సూచన

ఎస్బీఐ కస్టమర్లకు పీఐబీ కీలక సూచన

న్యూఢిల్లీ: ‘డియర్ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌బీఐ యూజర్‌‌‌‌‌‌‌‌, మీ యోనో అకౌంట్ బ్లాక్ అవుతుంది. పాన్‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌ను అప్‌‌‌‌డేట్ చేసుకోవడానికి  ఈ కింద లింక్‌‌‌‌ను క్లిక్ చేయండి ’ అంటూ ఫేక్  మెసెజ్‌‌‌‌లను  పంపుతూ ఎస్‌‌‌‌బీఐ కస్టమర్లను సైబర్ మోసగాళ్లు టార్గెట్ చేస్తున్నారని  ప్రెస్ ఇన్‌‌‌‌ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) పేర్కొంది. దీనిపై  ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది.  ఇటువంటి మెసెజ్‌‌‌‌లు, ఈ--మెయిల్స్‌‌‌‌కు రెస్పాండ్ కావొద్దని చెబుతోంది. ‘ఇలాంటి మెసెజ్‌‌‌‌లు మీకొస్తే , వెంటనే report.phishing@sbi.co.in లో రిపోర్ట్ చేయండి’ అని పీఐబీ  ప్రజలను హెచ్చరించింది.   అకౌంట్ నెంబర్‌‌‌‌‌‌‌‌, పాస్‌‌‌‌వర్డ్స్‌‌‌‌ లేదా ఇతర సెన్సిటివ్ ఇన్‌‌‌‌ఫర్మేషన్‌‌‌‌ను టెక్స్ట్‌‌‌‌ మెసెజ్‌‌‌‌ ద్వారా పంపొద్దని ఎస్‌‌‌‌బీఐ కూడా ప్రజలకు చెబుతోంది.  వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో సబ్మిట్ చేయడం ద్వారా లేదా ఫోన్‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌కు కాల్ చేయడం ద్వారా ఇన్‌‌‌‌ఫర్మేషన్‌‌‌‌ను అర్జెంట్‌‌‌‌గా అప్‌‌‌‌డేట్ చేయాలని , అకౌంట్‌‌‌‌ను యాక్టివేట్ చేసుకోవాలని,  ఐడెంటిటీని వెరిఫై చేసుకోవాలని  వచ్చే మెసెజ్‌‌‌‌లు ఫేక్ అయ్యే అవకాశాలు ఎక్కువని ఎస్‌‌‌‌బీఐ పేర్కొంది.    పర్సనల్ డేటాను సేకరించి, సైబర్‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లు మోసం చేస్తారని తెలిపింది.  ఏదైనా సైబర్ ఫ్రాడ్ గురించి రిపోర్ట్  చేయాలంటే డైరెక్ట్‌‌‌‌గా పైన పేర్కొన్న లింక్‌‌‌‌కు ఈ–మెయిల్ పంపొచ్చు. లేకుంటే  1930 నెంబర్‌‌‌‌‌‌‌‌కు కాల్ చేసి కూడా ఫ్రాడ్ గురించి రిపోర్ట్ చేయొచ్చు.  మరిన్ని వివరాలను https://cybercrime.gov.in/లో తెలుసుకోవచ్చు.