ఇందిరమ్మ ఇండ్లకు ఐటీఐల శిలాఫలకాలు..గ్రానైట్ మార్బుల్ పై ఇందిరమ్మ ఫొటో

ఇందిరమ్మ ఇండ్లకు ఐటీఐల శిలాఫలకాలు..గ్రానైట్ మార్బుల్ పై ఇందిరమ్మ ఫొటో
  • ప్రతి ఇంటి మీద ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లపై ఇందిరా గాంధీ ఫొటోతో శిలాఫలకం ఏర్పాటు చేయనున్నారు. వచ్చే నెల 2న ఇందిరమ్మ ఇండ్లపై వీటిని  ఏర్పాటు చేసేందుకు  ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ  శిలాఫలకాలను కార్మిక శాఖ పరిధిలో రన్ అవుతున్న ఐటీఐ స్టూడెంట్స్ రెడీ చేస్తున్నారు.

మొత్తం నాలుగు డిజైన్లు రెడీ చేసి హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చూపించగా ఇందులో ఒక డిజైన్ ను మంత్రి ఫైనల్ చేశారు. ఈ డిజైన్​లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఫొటో, సీఎం రేవంత్ రెడ్డి, హౌసింగ్ మంత్రి పొంగులేటి ఫొటోలు ఉన్నాయి. మల్లెపల్లి, విజయ్ నగర్ కాలనీ ఐటీఐల్లో వివిధ కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకుంటున్న స్టూడెంట్స్ వీటిని డిజైన్ చేసినట్లు కార్మిక శాఖ అధికారులు చెబుతున్నారు.