వందే భారత్ ఫుడ్ లో ప్లాస్టిక్ పేపర్

వందే భారత్ ఫుడ్ లో ప్లాస్టిక్ పేపర్

వందే భారత్ ఎక్స్ ప్రెస్ మరోసారి వార్తల్లోకెక్కింది. భోపాల్ - న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైల్లో వడ్డించిన భోజనంలో ప్లాస్టిక్ పేపర్ వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆ వ్యక్తి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తనకు ఆహారంలో ప్లాస్టిక్ పాలిథిన్ ముక్క వచ్చిందని ఆరోపించారు.

ఈ వీడియోలో రైలులో ప్రయాణిస్తోన్న వ్యక్తి తన భోజనంలో వచ్చిన ప్లాస్టిక్ కవర్ ముక్కను తీయడం చూడవచ్చు. ఈ వీడియో వైరల్ కావడంతో రైల్వే సేవా అధికారులు స్పందించారు. ఫిర్యాదు కోసం ఓ ట్రాకింగ్ లింక్ ను షేర్ చేశారు.

అంతకుముందు వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో కుప్పలుగా పడి ఉన్న చెత్తను చూపిస్తూ ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ఓ వీడియోను షేర్ చేశారు. రైళ్లలో శుభ్రపర్చే విధానాన్ని మార్చాలని ఆదేశించారు. క్లీనింగ్ విధానాన్ని విమానాల్లో పాటించే విధంగా పాటించాలని చెప్పాకు. అంతేకాకుండా రైళ్లలో పరిశుభ్రతను కాపాడుకునేందుకు ప్రజలు కూడా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.